
ఈ సమావేశం నిర్ణయాలు తీసుకొనేవి కావని, కేవలం సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే జరుగుతోందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. గతేడాది గుజరాత్‌లోని కర్ణావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, లఘు ఉద్యోగ్ భారతి తదితర సంస్థలు దేశంలో ఉపాధిని మెరుగుపరిచే ప్రణాళికలపై చర్చించాయి. వారు ప్రభుత్వ విధానాలు , క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారని ఆయన వివరించారు.
ఈ సంవత్సరం, విద్యా భారతి, ఎబివిపి, భారతీయ శిక్ష్ మండల్, ఇతరులతో విద్యారంగంకు సంబంధించిన అంశాలను చర్చిస్తారని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు తమ అనుభవాలను వివరిస్తారని సునీల్ అంబేకర్ చెప్పారు.
మరో నాలుగేళ్లలో ఆర్ ఎస్ ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా చేబడుతున్న పరివారణం (పర్యావరణ), పరివార్ ప్రబోధన్ (కుటుంబ అవగాహన), సామాజిక సమరస్తా (సామాజిక సామరస్యం) కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
75వ స్వాతంత్య్ర వేడుకల్లో అన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. వారు నిర్వహించిన కార్యక్రమాలు, ప్రత్యేక అంశాల గురించి కూడా చర్చలు జరుపనున్నారు. జనవరి 7 మధ్యాహ్నం 12. 30 గంటలకు జరిగే మీడియా సమావేశంలో సమావేశంలో జరిగిన చర్చల గురించి సహా సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్‌జీ వైద్య వివరిస్తారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు