పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా, షెడ్యూల్ విడుదల కాకపోయినా అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక పార్టీ మరో పార్టీలోకి నేతల ఫిరాయింపులు కూడా మొదలయ్యాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రారంభించిన నూతన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి.
తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అమ్రిక్ సింగ్ అలివాల్, మాజీ శాసనభ్యులు హర్జిందర్‌సింగ్ తేకేదార్, ప్రేమ్ మిట్టల్, ఫర్జానా ఆలం, రజ్వీందర్ కౌర్ భగీకేతోపాటు పలువురు స్థానిక నేతలు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌సింగ్‌తో బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించడంతో ఆయన ఆ పార్టీని నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్నారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!
కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు