
పాలమూరు ప్రాజెక్టులో రిజర్వాయర్లు అంతర్భాగమని, ముఖ్యంగా ఇవి సాగునీటి ప్రాజెక్టులో భాగమని, ఇవి లేకుండా సాగునీటి ప్రయోజనాలు నెరవేరవని ఎన్జీటీ గుర్తించింది. ప్రధానంగా 102 టీఎంసీల నీటిని పంపింగ్ చేయడానికి పంపులను బిగిస్తున్నట్లు సంయుక్త కమిటీ తెలిపిందని గుర్తు చేసింది. పర్యావరణ అనుమతుల కోసం చేసిన దరఖాస్తులోనూ ఈ ప్రాజెక్టులో సాగునీటి పనులు ఉన్నట్లు పేర్కొని ఉందని ధర్మాసనం వెల్లడించింది.
కరువు ప్రాంతాలకు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి ప్రయోజనాలు కలుగుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. పర్యావరణ అనుమతులు వర్తించే సాగునీటి పనులు ఉన్నప్పుడు పర్యావరణ చట్టాలను ఉల్లంఘించరాదని సూచించింది.
కాగా, పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇవ్వటానికి కేసీఆర్ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పాలమూరుపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేకపోవటంతోనే ఇలా జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. డీపీఆర్లు ఇవ్వకపోవటం, ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించకపోవటం వల్లనే స్టే వచ్చిందని ఆమె మండిపడ్డారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!