
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఆ షిప్‌లో జరిగిన పార్టీలోనిషేధిత మత్తు మందు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తన పంచనామా నివేదికలో స్పష్టం చేసింది.
ఆర్యన్ ఆ షిప్‌లో గంజాయి కొట్టాడని, అతడి ఫ్రెండ్ అర్బాజ్ మర్చెంట్ దగ్గర నిషేధిత డ్రగ్స్ దొరికాయని ఎన్సీబీ పేర్కొంది. గత ఆదివారం షిప్‌లో పార్టీ జరగుతుండగా పక్క సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. దాడి చేసిన సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? షిప్‌లోకి వెళ్లాక ఏం చేశారన్న వివరాలతో అధికారులు పంచనామా రాశారు.
షిప్‌లో దాడి తర్వాత ఆర్యన్ ఖాన్, అర్బాజ్‌లను గెజిట్ ఆఫీసర్ల ఎదుట వాళ్లను సోడా చేయాల్సి ఉంటుందని చెబితే, వాళ్లిద్దరూ అందుకు ఒప్పుకోలేదని అందులో పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే షూలో చారస్ దాచినట్లు అర్బాజ్ చెప్పాడని వెల్లడించారు. అతడి దగ్గర నుంచి ఆరు గ్రాముల రికవరీ చేసినట్లు పంచనామాలో నమోదు చేశారు.
ఆర్యన్‌తో పాటు తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అర్బాజ్ చెప్పాడని, డ్రగ్స్ తీసుకోవడానికే ఈ విహారయాత్రను ఎంచుకున్నట్లు వారు చెప్పారని ఎన్‌సీబీ తెలిపింది. ఆ తర్వాత ఆర్యన్‌ను ప్రశ్నించడంతో అతడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని నివేదికలో అధికారులు రాశారు. ఈ పంచనామాను ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవి, ప్రభాకర్ గోఘోజీ సేన్‌ల ఎదుట రికార్డ్ చేసినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్