నీలి చిత్రాలను రూ 19 కోట్లకు బేరం పెట్టిన రాజ్‌కుంద్రా

అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా గురించి షాకింగ్‌ విషయాలను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు వెల్లడించారు. కుంద్రా ఫోన్‌లో 119 నీలిచిత్రాలను గుర్తించామని, వాటిని రూ.9 కోట్లకు కుంద్రా బేరం పెట్టినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. 
 
రెండు నెలలపాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు సోమవారం కోర్టు బెయిల్‌ మంజూరు కావడంతో మంగళవారం జైలు నుండి విడుదలయ్యారు. 50వేల పూచీక‌త్తుపై మెజిస్ట్రేట్ భాజిపాలే ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేశారు. కుంద్రాతో పాటు అరెస్టు అయిన ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ ఇచ్చారు. 
 
శిల్లా షెట్టిని 2009 వివాహం చేసుకున్న రాజ్‌కుంద్రా జూలై 19న పోర్నోగ్రఫీ చిత్రాలు నిర్మించి, పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో విచారణ పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున తన కు బెయిలు మంజూరు చేయాలని శనివారంనాడు ఆయన కోర్టును అభ్యర్థించారు. 
 
ఈ కేసులో తనను బలిపశువును చేశారని, కేసులో తప్పుగా ఇరికించారని, పోర్న్ చిత్రాల షూటింగ్‌లో తన ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా తనపై చార్జిషీటు దాఖలు చేశారని బెయిల్ అభ్యర్థనలో కుంద్రా పేర్కొన్నారు. 
తన సొంత పనుల్లో బిజీగా ఉన్నందున తన భర్త వ్యాపార కార్యకలాపాల గురించి తనకేమీ తెలియదని శిల్పా షెట్టి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు ఛార్జిషీటులో పొందుపరిచారు.మొబైల్ అప్లికేష్లయిన ‘హాట్ షాట్స్’, ‘బాలీ ఫేమ్’ గురించి కూడా తనకు తెలియదని శిల్పా పేర్కొన్నారు. 
 కుంద్రాకు బెయిల్ మంజూరైన కొద్ది గంటలకే శిల్పాశెట్టి ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా ”గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనుస్సు” అంటూ ఓ ట్వీట్ చేసింది.
 
సెంట్ర‌ల్ ముంబైలో ఉన్న ఆర్డ‌ర్ రోడ్డు జైలులో రాజ్‌కుంద్రాను జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉంచారు. హాట్‌స్పాట్స్ అనే యాప్ ద్వారా అశ్లీల చిత్రాల‌ను అప్‌లోడ్ చేసిన‌ట్లు కుంద్రాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా కేసుపై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు స్పందించి పలు విషయాలను వెల్లడించారు. 
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్‌ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆకస్మిక దాడి చేశామని పేర్కొన్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించడంతో అక్కడ ఉన్న 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.  అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్‌ రాకెట్‌’ గుట్టుని బయటపెట్టామని చెప్పారు.
ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశామని తెలిపారు. విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించగా వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు పోలీసులు వివరించారు.