నేటి నుంచి చార్‌ధాం యాత్ర ప్రారంభం

దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చార్‌ధామ్ యాత్ర నేడు ప్రారంభం కానుంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న యాత్రకు నైనిటాల్ హైకోర్టు అనుమతించింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న, కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారిని మాత్రమే యాత్రకు అనుమతించాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు జారీ చేసింది.

హిమాలయ పర్వతాల్లోని దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై కోర్టు రోజువారీ పరిమితిని కూడా విధించింది. భక్తులు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

హిమాలయల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్​, కేదార్‌నాథ్​ ఆలయాలకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా కరోనా నియమాలను పాటించాలని స్పష్టం చేసింది. యాత్రికులు కనీసం 15 రోజుల క్రితం రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పొంది సర్టిఫికెట్ చూపించాలని సర్కారు సూచించింది

.దేవాలయాల చుట్టూ ఉన్న ఏ ఒక్క స్నానఘట్టాల్లోనూ స్నానం చేయడానికి ఎవరినీ అనుమతించరాదని కూడా కోర్టు ఆదేశించింది. చమోలి, రుద్రప్రయాగ్,  ఉత్తరకాశి జిల్లాల్లో చార్ ధామ్ యాత్ర సందర్భంగా పోలీసు బలగాలను మోహరించారు.కులకు టీకాను తప్పనిసరి చేసింది. యాత్రసాగినన్ని రోజులు.. బద్రీనాథ్‌కు రోజుకు వెయ్యి మంది చొప్పున, కేదార్‌నాథ్‌కు 8 వందల మంది, గంగోత్రి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.