
చైనాతో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారిగా లడక్‌లో ప్రత్యక్షమయ్యారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి ఆయన లడక్ వెళ్లారు.
నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అన్ని వివరాలు తెలిపారు. భారత సైన్యం తరపున హరిందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను మోదీ పరామర్శించనున్నారు.
ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవణే లడక్ వెళ్లారు. చైనా బలగాల దాడిలో గాయపడిన జవాన్లను పరామర్శించారు. చైనా బలగాల దాడిని తిప్పికొట్టిన భారత జవాన్లకు ప్రశంసా పత్రాలు కూడా అందించారు.
ఎల్ఏసీ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులతో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు. వాస్తవానికి ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్‌ను మార్చేశారు. దీంతో ఇవాళ ఉదయం మోదీ .. లడఖ్ చేరుకున్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు