మహా ప్రభుత్వం తాలిబన్ల ఆదేశాలతో పనిచేస్తుందా!

మహా ప్రభుత్వం తాలిబన్ల ఆదేశాలతో పనిచేస్తుందా!
 “మహారాష్ట్రలో హిందూ పండుగలపై అన్ని ఆంక్షలు ఎందుకు అమలు చేయబడుతున్నాయి?” అంటూ మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం హిందువులు జరుపుకొనే  జన్మాష్టమి వార్షిక “దహి హండి” వేడుకలను నిషేధించడం పట్ల మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే,  చీఫ్ విప్, ఆశిష్ షెలార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

శివసేన తన “హిందూత్వ” విషయంలో రాజీపడుతోందని ఆయన దుయ్యబట్టారు. దహీ హందీ వేడుకల సందర్భంగా బొంబాయి హైకోర్టు మానవ పిరమిడ్‌ల ఎత్తును పరిమితం చేసినప్పుడు అదే పార్టీ గగ్గోలు పెట్టినదని గుర్తు చేశారు. 

“కొన్ని సంవత్సరాల క్రితం, ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన కోర్టు, పిరమిడ్ ఎత్తులను పరిమితం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించినప్పుడు, శివసేనకు అంతులేని ఆవేశం వచ్చింది. భారతదేశంలో ఆంక్షలు విధించినట్లయితే, మేము పాకిస్తాన్‌కు వెళ్లి దహి హందీని జరుపుకోవా? అంటూ ఈ శివసేన ప్రశ్నించింది” అని ఆయన గుర్తు చేశారు.

మానవ పిరమిడ్‌లు, గుంపుల ఎత్తుపై పరిమితులు విధించినప్పటికీ ప్రభుత్వం దహి హండీని అనుమతించడానికి నిరాకరించిందని షెలార్ విస్మయం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, ఈ కార్యక్రమాన్ని నీరసంగా జరపాలని బిజెపి నిర్ణయించింది.

బిజెపితో పాటు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా దహి హండిపై ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తుందని ఆ పార్టీ  నాయకుడు బాల నందగాంకర్ ప్రకటించారు. “ప్రభుత్వం పండుగను ఎందుకు పరిమితం చేయాలి? మేము అన్ని కరోనా మార్గదర్శకాలకు భరోసా ఇస్తాము. శాంతియుత పండుగ వేడుకలను అనుమతించని మహారాష్ట్రను ఏ ప్రభుత్వం పరిపాలిస్తోంది?” అని ప్రశ్నించారు.

థానేలో, ఎంఎన్ఎస్ కార్యకర్త అవినాష్ జాదవ్ మద్దతుదారులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ లను సవాల్ చేసే విధంగా ఒక ప్రైవేట్ స్థలంలో ఈ పండుగకు సన్నాహాలు ప్రారంభించారు.

దహి హండి అనేది శ్రీకృష్ణుని జన్మదిన జ్ఞాపకార్థ సాంస్కృతిక కార్యక్రమం. ఇది శ్రీకృష్ణుని బాల్యానికి ప్రతీక. గోవిందాలు అని పిలువబడే 5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలలు, ఒక నిర్దిష్ట ఎత్తులో మందపాటి తాడు చేత పట్టుకున్న కుండ (హండీ)ని విచ్ఛిన్నం చేయడానికి మానవ పిరమిడ్‌ను ఏర్పరుస్తారు. 

 
పెరుగు (దహి) ఉన్న కుండను పగలగొట్టడమే సవాలు. సంవత్సరాలుగా దహి హందీని ఒక అభిమాన సాంస్కృతిక క్రీడగా జరుపుకొంటున్నారు.  కుండ ను విచ్ఛిన్నం చేయడంలో విజయం సాధించిన బృందానికి నగదు బహుమతి అందిస్తారు.