
తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక ప్రజలు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపోయేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయం వద్ద రద్దీ తీవ్రమైంది. దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు తాలిబన్లు పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘన్‌కు విముక్తి కల్పించాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఆఫ్ఘన్ కు విమానాలు నిలిపివేసిన పాక్
ఆఫ్ఘనిస్థాన్‌కు తాత్కాలికంగా విమాన రాకపోకలను పాకిస్థాన్ నిలిపేసింది. ప్రస్తుతానికి అక్కడి వాళ్లను తరలించే ప్రక్రియను ఆపేసింది. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్ గత కొన్ని రోజులుగా కాబూల్‌లో చిక్కుకుపోయిన దౌత్యవేత్తలు, విదేశీయులను అక్కడి నుంచి తరలిస్తూ వస్తోంది.
అయితే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో సరైన వసతులు లేకపోవడం, రన్‌వేపై భారీ ఎత్తున చెత్త పేరుకుపోవడం వల్ల తాత్కాలికంగా తమ విమానాలను నిలిపేస్తున్నట్లు పీఐఏ తెలిపింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అసలు భద్రతా సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది కూడా లేరని ఆ ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటి వరకూ ఐదు విమానాల్లో మొత్తం 1500 మంది జర్నలిస్టులు, యూఎన్ అధికారులు, పాకిస్థాన్ జాతీయులను తరలించినట్లు పీఐఏ తెలిపింది.
More Stories
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయి తకాయిచి!
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
దేశద్రోహం లాంటి చట్టాలు ప్రతిఘటనను అణిచేసేందుకే