
ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాడకూడని పదాలతో కూడిన ఓ చిన్నపాటి పుస్తకాన్ని మధ్యప్రదేశ్‌లో వెలువరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు సోమవారం ఆరంభం అవుతాయి. దీనికి ముందు ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ బుక్‌లెట్ ఆవిష్కరణ జరిగింది.
ఎమ్మెల్యేలు సభలలో ఏ పదాలు వాడకూడదు. ఏవి అన్‌పార్లమెంటరీ అనే విషయాలు , ఇంతకు ముందు సభలలో తొలిగించిన పదజాలాలు, వ్యాఖ్యలను ఇందులో పొందుపర్చారు. కేవలం పదాలే కాకుండా వ్యాఖ్యలు, సామెతలు, పలుకుబళ్లు వంటివి గేలిచేసే విధంగా ఉండేవి ఇందులో పొందుపర్చారు.
ఎమ్మెల్యేలు సభలో ఈ బుక్‌లెట్‌ను చూసుకుని తమ ప్రమాణాలను నిలబెట్టుకోవచ్చునని అధికారులు తెలిపారు. దాదాపుగా 1161 పదాలు, వ్యాక్యాలతో ఈ బుక్‌లెట్‌ను రూపొందించారు. పప్పూ, తానాషా, మిస్టర్ బంటాధార్ వంటివి వాడకూడని పదాలతో కూడిన బుక్‌లెట్‌లో ఉన్నాయి.
పప్పూ, బంటేదార్, ధోంగీ లాంటి అనుచిత పదాలను సభలో మాట్లాడుతున్న సమయంలో వినియోగించరాదని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. నిషేధిత పదాలతో పుస్తకం రూపొందించిన అసెంబ్లీని ఆయన ప్రశంసించారు.
38 పేజీల ఆ బుక్‌లెట్‌ను హిందీలో విడుదల చేశారు. ధోంగీ (మోసగాడు), నికమ్మ (విలువలేని), చోర్ దొంగ), బ్రష్ట్ (అవినీతి), తానాషా (నియంత), గుండే ( గుండాలు), జూటే బోల్నా ( అబద్దాలు చెబుతున్నాడు), వ్యభిచార్ కర్నా (వ్యభిచారం) లాంటి పదాలను ఇక నుంచి అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో వాడరాదు.
More Stories
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్