తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ, భారత దేశ బహుళజాతి కంపెనీలలో ఒకటైన అమ్రరజా బ్యాటరీస్ ను యాజమాన్యం చిత్తూర్ జిల్లా నుండి చెన్నైకి తరలించడానికి సిద్దపడిన్నట్లు తెలుస్తున్నది. దేశంలోనే రెండవ పెద్ద బ్యాటరీల ఫ్యాక్టరీ అయిన ఈ కంపెనీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వేధింపుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ కంపెనీలో కీలక వ్యక్తి అయినా గల్లా జయదేవ్ గుంటూరు నుండి రెండోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన అమ్మగారైన గళ్ళ అరుణకుమారి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జయదేవ్ ఇప్పుడు టిడిపిలో క్రియాశీలకంగా, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూ ఉండడంతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతున్నట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల పర్యావరణ సంబంధ ఆరోపణలపై కంపెనీకి విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. దానితో కొన్ని రోజులు ఉత్పత్తి కొంతమేరకు ఆగిపోయింది. హైకోర్టును ఆశ్రయించి, తిరిగి విద్యుత్ సరఫరాను పొందగలిగారు. కంపెనీ తరలింపు గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ఇప్పటికే యాజమాన్యం సమాలోచనలు జరిపినదని, అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తున్నది.
ఇప్పటికే చెన్నైలో నిర్మాణాలు ప్రారంభించారని చెబుతున్నారు. ఒక బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఈ కంపెనీ పన్నుల రూపంలో ఏటా రూ 2,400 కోట్ల మేరకు ప్రభుత్వాలకు చెల్లిస్తున్నది.ఆ పనులలో సగం మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకు వస్తున్నాయి. మరో మూడు నెలలో చెన్నైకి మకాం మార్చి వేసే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తున్నది. రాజకీయాలలోకి రాకముందు విదేశాలలో చదువుకొని వచ్చిన జయదేవ్ చెన్నై నుండే కంపెనీ వ్యవహారాలు చేస్తుండేవారు.
జన్మభూమిలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం కోసం జయదేవ్ నాన్నగారైన గాల్లా రామచంద్ర నాయుడు ఈ కంపెనీని 1985లో స్థాపించారు. ప్రస్తుతం సుమారు 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం, ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్ వ్యవస్థ ఉత్పత్తి, షీట్ మెటల్ ఉత్పత్తులు ఈ సంస్థ చేస్తుంది.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
విశాఖలో కంటైనర్ మెగా పోర్టు..నీతి ఆయోగ్