నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గౌరవించాలి

నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు తమకు తగిన పన్నులు చెల్లించినందుకు గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని, వివిధ సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు ఆదాయపు పన్ను శాఖను అభినందిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

ఆదాయపు పన్ను దినోత్సవం 161 వ వార్షికోత్సవం సందర్భంగా ఐ-టి విభాగానికి ఆమె ఇచ్చిన సందేశంలో, ఈ విభాగం, దాని విధానాలు,  ప్రక్రియలను సరళీకృతం చేయడానికి, దాని పనితీరును ఇబ్బంది లేని, సరసమైన, పారదర్శకంగా మార్చడానికి కృషి చేస్తూందని ఆమె అభినందించారు.

“నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు తమ పన్నుల వాటాను విధేయతతో చెల్లించడం ద్వారా దేశం పురోగతికి వారు చేస్తున్న కృషికి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని మంత్రి గమనించారు … మహమ్మారి వల్ల కలిగే ఇబ్బందులు ఉన్నప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ  బాధ్యతలను నిర్వర్తించినందుకు ఆమె ప్రశంసించారు.” అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

చాలా ప్రక్రియలు, అవసరాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు మార్చారు. దానితో  పన్ను చెల్లింపుదారులు పన్ను కార్యాలయాలను భౌతికంగా సందర్శించాల్సిన అవసరం తొలగించబడిందని లేదా తగ్గించబడిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పన్ను చెల్లింపుదారులతో పరస్పర చర్య ఇప్పుడు నమ్మకం, గౌరవం కలిగి ఉంటుంది, స్వచ్ఛంద సమ్మతిపై ఎక్కువ ఆధారపడుతుందని చెప్పారు.

రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవస్థలో వెలుగులోకి వచ్చిన మార్పులకు అనుగుణంగా, పన్ను వసూళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించగలిగినందుకు ఈ విభాగాన్ని అభినందించారు. ఆదాయ సేకరణ పట్ల దాని విధానాన్ని తిరిగి మార్చడానికి, దాని పనితీరును ట్రస్ట్-బేస్డ్, పన్ను చెల్లింపుదారుల కేంద్రీకృతం చేయడానికి డిపార్ట్మెంట్ చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) చైర్మన్ జె బి మోహపాత్రా పన్నుల అధికారుల సమిష్టి కృషిని ప్రశంసించారు. దేశ ఆదాయ సంపాదన విభాగం, పన్ను చెల్లింపుదారుల సేవలను అందించే వారి జంట పాత్రను సమర్థవంతంగా నెరవేర్చారని కొనియాడారు.

‘నిజాయితీని గౌరవించడం’ వ్యక్తిగతంగా హాజరు కానవసరంలేని పాలన, పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను స్వీకరించడం వంటి పెద్ద, దూరదృష్టితో గల  విధానపర  చర్యలను ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాలు డిపార్ట్‌మెంటల్ పనితీరును మరింత పారదర్శకంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా చేశాయని ఆయన పేర్కొన్నారు.