
గత కొద్దిరోజులుగా కోవిడ్ తో భాధపడుతూ మెరుగైన చికిత్సకోసం వరంగల్ నగరానికి వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన డివిజినల్ కమిటీ కార్యదర్శితో పాటు ఒక మైనర్ కొరియర్ ను మట్వాడా పోలీసులు అరెస్టు చేశారు. మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానంగా ములుగు నుండి వస్తున్న కారును తనీఖీ చేయగా, కారు వెనుక భాగంలో అనుమానస్పదంగా వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
వారు నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారుణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్, మావోయిస్టు పార్టీ కొరియర్ బందుగ వినయ్ లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు అరెస్టు చేసిన డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ కొండపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ కు చెందినవాడు, ఇతను అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999 సంవత్సరంలో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు.
కోవిడ్-19తో భాధపడుతు మెరుగైన చికిత్స కోసం వచ్చిన పోలీసులకు చిక్కిన మావోయిస్టు గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీకి చెందిన సూమారు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కోవిడ్ తో బాధపడుతున్నారు.
ముఖ్యంగా కేంద్ర కమిటీ నేత కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారాయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు ఆలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ , కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా అనారోగ్యంతో ఉన్నారు
కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు మావోయిస్టు పార్టీ వీరికి అనుమతించడం లేదని కేవలం ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మాత్రమే కోవిడ్ తో గురైనవారికి మెరుగైన చికిత్స పొందేందుకు మాత్రమే పార్టీ అనుమతి ఇవ్వడం జరుగుతోందని అతను చెప్పారు. కోవిడ్ 19 లేదా ఇతర వ్యాధులతో భాదపడుతున్న మావోస్టులు నాయకులు లేదా కార్యకర్తలందరికి స్వేచ్ఛగా భయటకి వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెరుగైన చికిత్స అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
పట్టుబడిన మావోయిస్టుకు కేంద్ర విభాగాని చెందిన అగ్రనాయకులు నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు, పుల్లూరి ప్రసాద్ రావు ఆలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవోజీ, యాప నారయణ ఆలియాస్ హరిభూషణ్, హిడుమలలో సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి ఆదేశాల మేరకు ఛత్తీస్ ఘడ్ పలు విధ్వంసకర సంఘటల్లో పాల్గొనటంతో పాటు పలు మంది పోలీసులను హత్య చేసి వారి అయుధాలను అపహరించిన ఘటనలలో పాల్గొన్నాడు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!