
బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్టు కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించినట్టు ఆయన వెల్లడించారు.
కాగా, కర్నాటకలో లాక్‌డౌన్ జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ పొడిగింపు నిర్ణయం అనేది నిపుణుల సూచనల మేరకే తీసుకున్నామని తెలిపారు.
అయితే ప్రస్తుతమున్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కూడా కొందరు రోడ్లపై తిరుగుతున్నారని, వారితోనే అసలు సమస్య అని పేర్కొన్నారు. అవసరమైతేనే రోడ్లపైకి రావాలని, అనవసరంగా ఎవరూ తిరగకూడదని విజ్ఞప్తి చేశారు.
కాగా, పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల నేపథ్యంలో కొన్ని కార్యకలాపాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసి, ఇన్ఫెక్షన్ నివారణ, కంట్రోల్ నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం కోరింది.
ఇన్ ఫెక్షన్ తీవ్రతను వెంటిలేషన్ ద్వారా తగ్గించవచ్చని తెలిపింది. ఇన్ఫెక్షన్ నివారణ అండ్ నియంత్రణ పద్ధతులు ఐసీయూలలో మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం