దేశం మరో ఏడు కరోనా వ్యాక్సిన్లు 

దేశం మరో ఏడు కరోనా వ్యాక్సిన్లు 

దేశం మరో ఏడు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోందని, భారతదేశంలోని ప్రతి పౌరుడికి టీకాలు వేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించాయిరు. వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు తక్షణ ప్రణాళిక లేదని, పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘మేం కేవలం రెండు టీకాలపైనే ఆధారపడటం లేదు. దేశీయంగా మరో ఏడు టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి’ అని తెలిపారు. 

భారత్​ అతిపెద్ద దేశం. అందరికీ టీకా అందాలంటే మరిన్ని వ్యాక్సిన్లు అవసరం. ఈ వ్యాక్సిన్లలో మూడు ట్రయల్​ దశలో ఉన్నాయి. రెండు ముందస్తు క్లినికల్ దశలో ఉన్నాయి. ఒక టీకా తొలి దశ, మరో రెండు రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని వివరించారు. 

ప్రస్తుతం వ్యాక్సిన్లు అత్యవసర ప్రాతిపదికన, పూర్తి పరిశీలనలో, నియంత్రిత పద్ధతిలో నిర్వహించబడుతున్నాయని స్పష్టం చేశారు. టీకాలు బహిరంగ మార్కెట్‌లో విడుదల చేస్తే.. వాటిపై ఎలాంటి నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.