భారత్ బయోటెక్ 3వ దశ క్లినికల్ ట్రయల్ 

కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 25,800 వాలంటీర్లను నియమించుకున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ  తెలిపింది. కోవాక్సీన్‌కు అవసరమైన మూడు దశల ట్రయల్స్‌లో ఇప్పటికి రెండు పూర్తయ్యాయి. 

కాగా ప్రస్తుతం చేపట్టబోయేది చిట్ట చివరిది. ఇది పూర్తైన పూర్తి స్వదేశీ కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి వచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయమై జనవరి 5న విలేకర్ల సమావేశంలో టీకా యొక్క సామర్థ్యంపై వచ్చిన ప్రశ్నలపై భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ ఎల్లా స్పందిస్తూ తాము ఈ విమర్శలకు అనర్హులమని అన్నారు.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో జనవరి 2న టీకా మొదటి దశ డ్రై రన్ పూర్తైంది. రేపు మరిన్ని రాష్ట్రాల్లో టీకా రెండవ దశ డ్రై రన్ ప్రారంభమవుతుంది. టీకా తయారీదారులకు అత్యవసర వినియోగంపై అనుమతి ఇచ్చిన అనంతరం సరిగ్గా 10 రోజుల్లో కోవిడ్-19 కోసం టీకాలు టీకాలు వేయడం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 

భారత్ బయోటెక్ సంవత్సరానికి 700 మిలియన్ మోతాదుల సామర్థ్యంతో నాలుగు వ్యాక్సిన్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎల్లా సోమవారం పేర్కొన్నారు. దేశంలో సామూహిక టీకాలు వేయడానికి ప్రభుత్వం అనుమతించిన రెండు సంస్థలలో కోవాక్సిన్ ఒకటి.