
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ స్థానికేతరుడిని దారుణంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్పాల్ నిశ్చల్ (70) అనే నగల వ్యాపారి కశ్మీర్లో 50 ఏళ్లుగా నివాసముంటున్నారు. ఆయన శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెసిస్టంట్ ఫ్రంట్ అనే ఉగ్రమూఠా ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రకటించుకుంది. కేవలం స్థానికేతరులను బెదిరించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 15 ఏళ్ళ పాటు స్థానికంగా నివాసమున్న వారికి స్థానికులనే సర్టిఫికెట్ జారీ చేయడం ప్రారంభించారు.
స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఆక్రమణదారులుగానే భావిస్తామని ఉగ్రముఠా చెప్పుకొచ్చింది. అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూ – కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే.
దీంతో అక్కడి స్థిరాస్తులను స్థానికేతరులు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు 10 లక్షల మంది స్థానికేతరులు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు గుణాంకం చెబుతున్నాయి. ఆ విధంగా ధ్రువీకరణ పత్రం పొందిన వారిలో బహుశా మొదటగా ఇతనినే ఉగ్రవాదులు కాల్చి చంపారు.
వీరిలో చాలామంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే. అయితే, వీరిలో స్థానికేతరులు ఎవరన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదు.
More Stories
పైలెట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం
30 నాటికి ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం