ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకు సిఎస్ కార్యాలయంలో నీలం సాహ్నినుండి ఆయన సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ సిఎస్ గా పనిచేసిన నీలం సాహ్ని గురువారం పదవీ విరమణ పొందారు.కాగా నీలం సాహ్ని సియం ప్రిన్సిపల్ అడ్వయిజర్ గా ఇప్పటికే నియమితులు కాగా ఆమె త్వరలో ఆబాధ్యతలు చేపట్టనున్నారు.
సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాధ్ దాస్ అంతర రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై తన తొలి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా తన వంతు ప్రయత్నం చేస్తానని సిఎస్ చెప్పారుపేర్కొన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత కష్టించి పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి సాధించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
తనతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాధిపతులు సమన్వయంతో మెరుగైన రీతిలో పనిచేసి నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేసేలా ప్రయత్నం చేస్తానని సిఎస్ ఆదిత్యానాధ్ పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

More Stories
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య
హామీల అమలుకై ‘గూగుల్’ నిర్వాసితులు పనుల అడ్డగింత