మోదీకి పేరొస్తుందనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దూరం 

మోదీకి పేరొస్తుందనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దూరం 

ప్రధానినరేంద్ర మోదీకి  పేరు వస్తుందనే భయంతోనే తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసీఆర్ అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లకు లింకు పెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పెద్దపల్లి జిల్లా జూలపల్లి లో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాన్ని మాజీ ఎంపీ,  బీజెపీ నేత వివేక్ వెంకటస్వామి తో కలసి ఆవిష్కరిస్తూ  ఆర్యవైశ్యులకు వెయ్యి కోట్లతో భవనం నిర్మించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. 

అలాగే అన్ని కుల సంఘాలకు బోనాలు నియమిస్తామని సీఎం అబద్ధాలు చెప్పారని.. ఈ ప్రకటన చేసినప్పుడు పాలాభిషేకం చేసిన నాయకులంతా ఇప్పుడు ఎక్కడున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కుల సంఘాల నాయకులు సీఎం మోచేతి నీళ్లు తాగడం వల్లే నిరుపేద కులాల వారికి మ అన్యాయం జరుగుతోందని విమర్శించారు. 

అగ్రవర్ణ నిరుపేదలకు రిజర్వేషన్ అమలు చేయాలని బిజెపి, ఏబీవీపీ పోరాటం చేసినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదనిమండిపడ్డాయి రు. రాబోయే రెండేళ్లలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే 2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.