మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ మహా ఉద్యమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మద్దతు కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. “డ్రగ్స్ రహిత భారత్ కోసం మనమందరం గొంతు విప్పుదాం” అనే నినాదంతో నిర్వహిస్తున్న “హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్” కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రభాస్‌ను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో సినీ తారల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది మంది అభిమానులను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేయగల శక్తి ప్రభాస్‌కు ఉందని, ఆయన పిలుపు ఇస్తే యువతలో గొప్ప చైతన్యం వస్తుందని మంత్రి ఆకాంక్షించారు.

More Stories
వేయేళ్లు వేములవాడ ఆలయం కట్టడాలు, విగ్రహాలపై అనుమానాలు
పాతబస్తీలో మైనర్లను వివాహం పేరుతో ఎర వేస్తున్న దళారులు
‘నషా ముక్త్ భారత్’ దిశగా సమష్టి పోరాటానికి పిలుపు