శబరిమలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి

అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లేందుకు ప్రతిరోజూ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అదనపు కోచ్‌లు పెంచాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు కూడా వినతిపత్రాలు పంపించారు. 
 
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు మోహన్ రావు, ప్రాంత కార్యదర్శి లక్ష్మీనారాయణ, ప్రాంత సహకారదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవంక, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిత చింతక్ అభియాన్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రాంత అధ్యక్షులు బి. నరసింహమూర్తి, ప్రాంత కార్యదర్శి లక్ష్మీనారాయణ, ప్రాంత సహకారదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులందరు విశ్వ హిందు పరిషత్ లో సభ్యత్వం తీసుకోవాలని  వి హెచ్ పి నాయకులు కోరారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి హిత చింతక్ అభియాన్ పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా కోటి, తెలంగాణ లో 5 లక్షల మందిని సభ్యత్వ నమోదుకై లక్ష్యం పెట్టుకున్నామని పెట్టుకొన్నారు.

About The Author