నోటీసులు అందుకున్న వారిలో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఉన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి చంచల్ కుమార్‌తోపాటు కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్సీ) ఉన్నతాధికారులకూ హైకోర్టు నోటీసులు పంపింది. ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాలను 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే వీక్షించాలన్న నిబంధన అమలుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మైనర్లు థియేటర్లలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు? అన్న అంశాలపై కోర్టు వివరణ కోరినట్లు తెలుస్తోంది.
సినిమాలకు సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా, వాటి ప్రదర్శన సమయంలో నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా సంబంధిత వ్యవస్థలపై ఉంది. ముఖ్యంగా ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాల విషయంలో వయోపరిమితిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలులో లోపాలున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Stories
మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు
మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు