ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. విదేశీ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరమా చెబుతూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను మంట కలిపే ఎజెండాతో పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తే నరేంద్ర మోదీ గౌరవం తగ్గుతుందని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రపంచ దేశాల్లో అవమానించడం దేశంలోని 140 కోట్ల ప్రజలను అవమానించడమే అని స్పష్టం చేశారు. “‘సెంచరీ డిఫీటెడ్ లీడర్’గా రాహుల్ గాంధీ అవతరించారు. అయినా కూడా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి ఆలోచన ఏంటనే విషయాన్ని రాహుల్ గుర్తించలేకపోతున్నారు. అందుకే దేశంలోని రాజ్యాంగ సంస్థలపై, దేశ ప్రజలపై ఆరోపణలు చేస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇప్పటివరకు ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా చేయలేదని గుర్తు చేశారు.
కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, దేశం ఆర్థిక విపత్తు దిశగా వెళ్తోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని పేర్కొంటూ మోదీ గారిపై విమర్శలు చేయొచ్చు, కానీ దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించకండి అంటూ హితవు చెప్పారు.
కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, దేశం ఆర్థిక విపత్తు దిశగా వెళ్తోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని పేర్కొంటూ మోదీ గారిపై విమర్శలు చేయొచ్చు, కానీ దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించకండి అంటూ హితవు చెప్పారు.
ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా విఫలం అవుతుంటే భారత్ మాత్రమే అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ దేశాలు నివేదికలు సమర్పిస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం దేశం సంక్షోభంలో ఉందని మాట్లాడటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. దేశంలోని రక్షణ, తయారీ రంగం, సెమీకండక్టర్, ఆటోమొబైల్ రంగంలో ఎగుమతులు పెరిగాయని పేర్కొంటూ కనీస అవగాహన లేకుండా మేకిన్ భరత్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. భారత్లో డేటా సెంటర్లు పెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో భారత్ ను ఎప్పుడూ గౌరవప్రదమైన స్థాయికి తీసుకెళ్లేలా ప్రయత్నించలేదని, భారత ప్రధాని వేరే దేశాలకు వెళ్తే.. అప్పులు అడిగేందుకే వచ్చారనేలా పరిస్థితిని మార్చారని చెబుతూ మోదీ నేతృత్వంలో భారత్ వైపు అత్యున్నతమైన భావనతో చూస్తున్నారని తెలిపారు. జి-20, బ్రిక్స్, క్వాడ్, ఎస్సీఓ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్ చురుకైన పాత్ర పోషిస్తోందని చెప్పారు.
మన దేశం చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే దీన్ని ఓర్వలేక ఎలాగైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని, ప్రధాన మంత్రిని గద్దె నుంచి దించాలని, దేశంలో పార్లమెంట్, సుప్రీంకోర్టు నిర్వీర్యం కావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

More Stories
మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు
హిత చింతక్ అభియాన్లో ప్రతి హిందువు భాగస్వామి కావాలి
‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు నాగార్జున మద్దతు!