యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొరారు.
ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యతని తెలిపారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

More Stories
మునుగోడుకు నిధులు ఆపేస్తే ఇది మరో కురుక్షేత్రం అవుతుంది!
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తాం
మియాపూర్లోని 550 ఎకరాల భూముల వేలంకు బిజెపి వ్యతిరేకం