అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ 550 ఎకరాల భూమిపై ఇటీవల సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములను వేలం వేసి అమ్ముకోవాలని చూడటం దారుణమని విమర్శించారు. ఈ 550 ఎకరాలలో దాదాపు 150 ఎకరాల భూమిలో 1983 నుండే అధికారిక రిజిస్ట్రేషన్లు, హెచ్ఎండీఏ అప్రూవ్డ్ లేఅవుట్లు, బ్యాంకు లోన్ల ద్వారా మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఖాళీగా ఉన్న మిగిలిన 400 ఎకరాల భూమిని 2,500 నుండి 5,000 గజాల ప్లాట్లుగా విభజించి బహిరంగ వేలంలో అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు.
ప్రజా సంక్షేమం కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన ఆయన, ప్రజల హక్కులు, నివాసాలను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం (కోర్టుకు వెళ్లడం) చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వ భూముల వేలాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ‘లక్ష సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, స్వయంగా తానే మొదటి సంతకం చేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వివరించారు.

More Stories
తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు డిసెంబర్ 22 వరకు పొడిగింపు
ఇటలీ నేతతో దేశాన్ని తిట్టించిన `మాస్టర్ మైండ్’ రేవంత్ రెడ్డి
మూడు మావోయిస్టుల డంప్ లు స్వాధీనం