తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణకు డువును మరోసారి పొడిగించింది. తొలుత డిసెంబర్ 10వ తేదీతో ముగియాల్సిన ప్రక్రియను తాజాగా డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులకు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించనుంది.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితాలో గైర్హాజరు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మరణించినవారు, డూప్లికేట్ ఓటర్లు అనే కేటగిరీల్లో గుర్తించిన వారిని ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చుతారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఎన్యుమరేషన్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనల నేపథ్యంలో ఈ కేటగిరీ ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ఈ నెల 18వ తేదీలోగా ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఫారాలను పంపిణీ చేసి, తిరిగి సేకరించనున్నారు.
ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యుమరేషన్ ఫారాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 10వ తేదీలోగా పూర్తి చేయాలి. అనంతరం ఓటర్ల జాబితాకు సంబంధించి నోటీసుల జారీ, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణతోపాటు వాటి పరిష్కార ప్రక్రియను డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22వ తేదీన ప్రచురించనున్నారు.
గతంలో నవంబర్ 30వ తేదీన తుది జాబితా విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా ఈ గడువును డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, నాగాలాండ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ సవరించిన షెడ్యూల్ అమలు కానుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన షెడ్యూల్‌పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా కొత్త గడువులు, ప్రక్రియ వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోయినా, ఓటు హక్కుకు అర్హత ఉన్నవారు నిర్ణీత ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

More Stories
ఇటలీ నేతతో దేశాన్ని తిట్టించిన `మాస్టర్ మైండ్’ రేవంత్ రెడ్డి
మూడు మావోయిస్టుల డంప్ లు స్వాధీనం
తెలంగాణ గ్రామాల్లో 95.3 శాతం మందికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు