ఆక్స్ఫర్డ్ యూనియన్‌లో ప్రసంగించిన సందర్భంగా లలిత్ మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రిటన్ పౌరసత్వం పొందేందుకు సాగిన ప్రయాణంతో పాటు యునైటెడ్ కింగ్డమ్తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. సెప్టెంబర్ 15న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి బ్రిటిష్ పౌరసత్వాన్ని స్వీకరించినట్లు తెలిపారు.
చాలా సంవత్సరాలుగా బ్రిటనే తన నివాసమని, అక్కడి ప్రజలు, సంస్థలు, సంప్రదాయాలు, విలువల పట్ల తనకు ఎంతో గౌరవం, అభిమానం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ‘బ్రిటిష్ పౌరసత్వం పొందడం ఒక ప్రత్యేక గౌరవం. అదే సమయంలో అది ఒక బాధ్యత కూడా. గర్వం, కృతజ్ఞత, నిజమైన ఆత్మీయతతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నా’ అని లలిత్ మోదీ తన పోస్టులో రాశారు.
వివిధ సంస్కృతులు, అనుభవాలతో సాగిన తన జీవితాన్ని గుర్తు చేసుకున్న ఆయన ఇకపై తాను గర్వంగా సొంత ఇల్లుగా భావిస్తున్న బ్రిటన్‌కు సానుకూలంగా తన వంతు సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించేందుకు అవకాశం కల్పించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆక్స్ఫర్డ్ యూనియన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటన్ రాజు చార్లెస్-3 జన్మదినం సందర్భంగా ఈ ప్రకటన చేయడం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. చివరగా ‘గాడ్ సేవ్ ది కింగ్!’ అంటూ తన పోస్టును ముగించారు.

More Stories
ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు డిసెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు
ఎన్విడియా చీఫ్ రేసులో ముగ్గురు భారత సంతతి సీఈవోలు!
ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా