ముఖ్యంగా ఏంసీసీ 4111, 4784, 4131 కేటగిరీల కింద నమోదయ్యే లావాదేవీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు క్రెడిట్ కార్డుతో రవాణా సేవల కోసం రూ.35,000 చెల్లిస్తే, అదనంగా రూ.350 ఛార్జీ పడుతుంది. అంటే అసలు చెల్లింపుతో పాటు ఈ అదనపు మొత్తం కూడా క్రెడిట్ కార్డు బిల్లులో కలుస్తుంది. కాబట్టి రవాణా సేవల కోసం పెద్ద మొత్తంలో కార్డు ఉపయోగించే వారు ఈ మార్పును గుర్తుంచుకోవాలి.
పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనల్లోనూ ఎస్‌బీఐ కార్డ్ మార్పులు చేసింది. ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చేసే అర్హత కలిగిన ఫ్యూయల్ లావాదేవీల మొత్తం రూ.50,000 దాటితే 1 శాతం అదనపు ఛార్జీ విధిస్తారు. ఏంసీసీ 5172, 5541, 5542, 5983 కేటగిరీల కింద జరిగే ఫ్యూయల్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే రూ.50,000 దాటిన అదనపు మొత్తంపై మాత్రమే కాకుండా, ఆ బిల్లింగ్ సైకిల్‌లోని మొత్తం అర్హత కలిగిన ఫ్యూయల్ ఖర్చుపై 1 శాతం ఛార్జీ విధిస్తారు. ఉదాహరణకు, ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధనం కోసం రూ.60,000 ఖర్చు చేస్తే, మొత్తం మొత్తంపై 1 శాతం చొప్పున రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే నవంబర్ నెల వరకు పాత నిబంధనలే కొనసాగుతాయి. అదనపు ఛార్జీల భారం తగ్గించుకోవాలంటే వినియోగదారులు ప్రతి బిల్లింగ్ సైకిల్‌లో ఫ్యూయల్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ముందుగానే అంచనా వేసుకోవాలి. అలాగే రవాణా సేవలకు చేసే చెల్లింపులు రూ.30,000 పరిమితిని దాటుతున్నాయా లేదా గమనించాలి.

More Stories
ఎన్విడియా చీఫ్ రేసులో ముగ్గురు భారత సంతతి సీఈవోలు!
ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా
ఆర్బీఐ గరిష్ట పరిమితి దాటిన ధరల పెరుగుదల