ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో ప్రపంచ అగ్రగామిగా దూసుకుపోతున్న చిప్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. చైనా గూఢచారిగా భావిస్తున్న ఆలిస్ హువాంగ్‌తో ఆయన వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాదాలు ముదరడంతో డైరెక్టర్ల బోర్డు ఆయనపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలీసా హువాంగ్‌తో పాటు తన సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని నివేదికలు వచ్చాయి. అయితే బోర్డు నిర్ణయం కంటే ముందే జెన్సన్ హువాంగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ తాత్కాలిక సీఈఓగా కొలెట్ క్రాస్ బాధ్యతలు చేపట్టారు.   ఎన్విడియా క్లయింట్ అయిన సింగపూర్ సంస్థ మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో ఆయనకున్న సంబంధం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

ఆమె చైనా నిఘా వర్గాలకు ఏజెంట్‌గా వ్యవహరిస్తూ అమెరికా నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ చిప్‌లను చైనాకు చేరవేయడంలో ఈ సంబంధాన్ని ఉపయోగించుకున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్) కింబర్లీ పావెల్‌తో కూడా ఆయనకు సంబంధం ఉన్నట్లు నివేదికలు రావడంతో డైరెక్టర్ల బోర్డు అత్యవసరంగా భేటీ అయింది. 

సంస్థ నియమావళి, జాతీయ భద్రత, కార్పొరేట్ విశ్వసనీయత దెబ్బతిన్న నేపథ్యంలో బోర్డు ఆయ‌నను తొలగించేందుకు సిద్ధమైంది. దాంతో హువాంగ్ తానే స్వ‌యంగా తప్పుకోవాల్సి వచ్చింది. సంస్థలో ఇప్పటివరకు ఎలాంటి వారసత్వ ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన కొలెట్ క్రాస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. ఈ నాయకత్వ సంక్షోభం వాల్‌స్ట్రీట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. 

ఇదిలా ఉండగా, జెన్సెన్ హువాంగ్ రాజీనామాతో ఎన్విడియా కంపెనీ షేర్లు 13 శాతం మేర పతనమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయడంతో, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్విడియా షేర్లు 13.09% తగ్గి, $150.98 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

జూలై 2025 తర్వాత మొదటిసారిగా ఎన్విడియా మార్కెట్ విలువను 4 ట్రిలియన్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి.  వివాదం మొదలైన నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 430 నుంచి 600 బిలియన్ డాలర్ల మేర సంపద ఆవిరైంది. ఇదే సమయంలో ఎన్విడియా ప్రత్యర్థి సంస్థలైన ఏఎండీ, బ్రాడ్‌కామ్ షేర్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. మరోవైపు ఈ సంక్షోభం రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరుగుతున్న‌ది. నష్టపోయిన మదుపర్లు శాన్ జోస్ కోర్టులో క్లాస్ యాక్షన్ దావా వేశారు.

About The Author