వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణల దుమారం  

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ ఏయూ) వైస్‌ చాన్స్‌లర్‌ అల్దాస్‌ జానయ్యపై అదే విద్యాసంస్థకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీసీ వ్యవహారశైలిని మీడియాకు వివరిస్తూ బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. 
 
జానయ్య ‘బయోలాజికల్‌ నీడ్స్‌ అనే పదం వాడటం, నువ్వు 20 ఏండ్ల క్రితమే పుట్టి ఉంటే నిన్ను పెండ్లి చేసుకునేవాడిని, నీతో ఏకాంతంగా సమయం గడుపాలని ఉన్నది, ఒక్కసారన్న నాతో ఢిల్లీకి రావాల్సిందే’ అంటూ వీసీ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి తనను మానసికంగా, వృత్తిపరంగా తీవ్ర క్షోభకు గురిచేశారని ఆరోపించారు. ‘నీకు చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. నీ భర్త ఎక్కడో అబుదాబిలో ఉంటడు. నిన్ను నువ్వు ప్రూవ్‌ చేసుకోకపోతే బదిలీ చేస్తా’ అని చెప్పేసరికి భయమేసిందని ఆమె తెలిపారు. 
 
ఎందుకంటే ఆయనకు పొలిటికల్‌ పవర్‌ ఉన్నది. ఆర్థికంగా కూడా బలవంతుడు.. చాలామంది ఆయనకు మద్దతిచ్చేవాళ్లు కూడా ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న తానే ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే ఇక ఎందుకు అనే ఒకే ఒక్క కారణంతో పది రోజుల క్రితం వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కేసును వెనకి తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె పేరొన్నారు. 
 
‘ఈ వ్యవహారం బయటకు వస్తే నీ పరువే పోతుంది, వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకో’ అంటూ బెదిరించడంతో ఇక ఏ దికూతోచక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నేరుగా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడిస్తున్నట్టు ఆమె చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ యూనివర్సిటీలో తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. వీసీ జాన‌య్య‌కు వ్య‌తిరేకంగా ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు.  అయితే,విశ్వవిద్యాలయంలో పరిపాలన, బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నందుకే వీసీపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ బోధన, బోధనేతర మహిళా ఉద్యోగులు స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగులు భార్గవి, మాధవీలత, హేమలత, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు మాట్లాడారు. 

ఆరోపణలు చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌] చాలాకాలంగా హైదరాబాద్‌లో పనిచేస్తుండటంతో మరోచోట 12 ఏండ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని ఇక్కడకు, అతని స్థానంలో తేజశ్రీని బదిలీ చేశారని పెక్రోన్నారు. దాంతోపాటు పదవీ విరమణ వయస్సు పెంచలేదన్న అక్కసుతో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేయిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని వారు కోరారు.

About The Author