ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలకు కేంద్రం రూ.1,091 కోట్లు

ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించనున్న ఐదు మెడికల్, నర్సింగ్ కాలేజీలతో పాటుగా భోధనాసుపత్రులకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో పీపీపీ విధానంలో మెడికల్, నర్సింగ్, భోదనాసుపత్రుల్ని నిర్మించనుంది. 
 
ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం రూ.1,091.11 కోట్ల వీజీఎఫ్‌ (వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌) ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ వీజీఎఫ్ నిధులపై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఈనెల 9న సాధికార కమిటీ సమావేశంలో చర్చించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
రాష్ట్రంలో ఐదు చోట్ల పీపీపీ విధానంలో మెడికల్, నర్సింగ్, బోధనాసుపత్రులు నిర్మిస్తున్నామని, వీటికి వీజీఎఫ్‌ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గత నెలలో ఏపీఎంఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు- మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ), మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల బృందం డిల్లీలో కేంద్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖతోపాటు నీతి ఆయోగ్‌కు ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించింది. ఈ మేరకు కేంద్రం పీపీపీ ప్రాజెక్టు మొత్తం విలువలో 30% నిధులు సమకూర్చేందుకు ఆమోదం తెలిపింది.

కేంద్రం రూ.1,091.11 కోట్ల వీజీఎఫ్‌ (వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌)లో బాపట్ల- రూ.242.41 కోట్లు, పాలకొల్లు- రూ.225.85 కోట్లు, నర్సీపట్నం- రూ.219.61 కోట్లు, పెనుకొండ- రూ.215.37 కోట్లు, అమలాపురం- రూ.187.87 కోట్లను సమకూర్చనుంది. ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఒక్కోచోట 625 పడకల అత్యాధునిక బోధనాసుపత్రి, 150 యూజీ, 24 పీజీ సీట్లతో వైద్యకళాశాల, 60 సీట్లతో నర్సింగ్‌ కళాశాలలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. 

 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026-27 విద్యాసంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సిద్ధమైంది. నీట్‌-యూజీ 2026కు హాజరైన అభ్యర్థులతో పాటు, ఏపీ ఈఏపీసెట్‌-2026లో అర్హత సాధించిన అభ్యర్థులకూ తుది మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌ రౌండ్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ మేరుక దరఖాస్తు చేసుకోడానికి వీలుగా రిజిస్ట్రేషన్‌ గడువును 10 రోజులు పొడిగించింది.

About The Author