గత వారం స్టాక్ మార్కెట్ ర్యాలీ పెట్టుబడిదారులకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ సోమవారం బ్యాంకింగ్ స్టాక్‌లలో భారీ పతనం కనిపిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దాంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మధ్యాహ్నం 2.45 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల పతనంతో 73720 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పడిపోయింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 73708.54 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి కాస్త కోలుకున్నా ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో నష్టాల్ని మిగిలిస్తుంది. స్టాక్ మార్కెట్ పడిపోతున్న క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. కిందటి సెషన్ క్లోజంగ్ సమయంలో మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 473 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా ఇప్పుడు అది రూ. 468 లక్షల కోట్ల దిగువకు చేరింది.
సెన్సెక్స్ 30 ప్యాక్ ఇండెక్స్‌లో చూస్తే అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఇండిగో వంటివి లాభాల్లో ఉండగా, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ స్టాక్స్, ఇతర ఐటీ, ఎఫ్ఎంజిజి స్టాక్స్ నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 4 శాతానికిపైగా పడిపోయింది. అల్ట్రా సిమెంట్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ వంటివి 2 శాతానికిపైగా పడిపోయాయి.
ప్రైవేట్ బ్యాంకుల బలహీన ఫలితాలు- ఇటీవల వీకెండ్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. మేనేజ్మెంట్ ఆందోళనల వల్ల బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోతోంది. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోగా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
గత వారం అమెరికా మార్కెట్లలో ఏఐ ఆధారిత, సెమీకండక్టర్ స్టాక్స్‌లో భారీగా అమ్మకాలు జరగడం వల్ల మన ఐటీ, ఇతర రంగాలపై ప్రభావం పడింది. బ్రెంట్ క్రూడ్ ధరలు స్వల్పంగా తగ్గినా ఇంకా గరిష్ఠ స్థాయిల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధర 108 డాలర్లకుపైన ఉండగా, దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది ప్రతికూలంగా మారింది. ఇది కూడా అమ్మకాల ఒత్తిడి కారణమైంది.

More Stories
టాటా ట్రస్ట్ దేశవ్యాప్తంగా 40 నుంచి 50 ఆస్పత్రుల నెట్వర్క్
ప్రియ గోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా, దొడ్ల పాలలో డిటర్జెంట్ అవశేషాలు
భారత్‌పై 100% సుంకాలు విధించే రష్యాపై ఆంక్షలను ఎత్తేసిన ట్రంప్