ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని అక్టోబర్ 28 నాటికి వీడాలని ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని క్రాంతి మైదాన్ వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఈఓ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జరిగిన ఒక రాజకీయ నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అతను బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మేనల్లుడు. ఈ బహిష్కరణ ఉత్తరువును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది తెలిపారు.
ఈ ధర్నాలో ‘జానే తూ యా జానే నా’, ‘ఢిల్లీ బెల్లీ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటుడు ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో శాంతిభద్రతల దృష్ట్యా స్థానిక ముంబై పోలీసులు ఆయనను తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీస్ వ్యానులో కూర్చున్న ఫొటోను సైతం ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం విస్తృతంగా వైరల్ అయింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు, ఆయన బంధువు మరియు ‘మేడ్ ఇన్ హెవెన్’ నటుడు జైన్ ఖాన్ కూడా నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.
భారత పౌరుడు కాకపోయినప్పటికీ, దేశీయంగా నిర్వహించిన రాజకీయ సంబంధిత నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు గాను ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తని, భారత పౌరుడు కాకపోయినప్పటికీ దేశీయ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చి నిరసనల్లో పాల్గొనడం చట్టవిరుద్ధమని ఆయన గమ్‌దేవి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే ఎఫ్ఆర్ఆర్ఓ విభాగానికి నివేదించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఇమ్రాన్ ఖాన్ విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైందని నిర్ధారిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కి భారత ప్రభుత్వం నుంచి ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డ్ కూడా ఉంది. ఈ కార్డ్ వలన విదేశియులకు వర్తించే సౌకర్యాలతో పాటు నిబంధనలపై ప్రస్తుతం నెట్టింటా చర్చ జరుగుతుంది.
2005లో ప్రవేశపెట్టిన ఓసీఐ పథకం ద్వారా విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు భారతదేశాన్ని రావడానికి, ఇక్కడ నివసించడానికి, కొన్ని ఆర్థిక, విద్యాపరమైన ప్రయోజనాలను పొందడానికి జీవితకాల వీసా సదుపాయం లభిస్తుంది. అయితే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వంద్వ పౌరసత్వం కాదని, ఓసీఐ హోల్డర్లు కేవలం విదేశీ పౌరులు మాత్రమేనని చట్టం స్పష్టం చేస్తోంది. భారతీయులకు లభించే రాజకీయ హక్కులు, ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదా ప్రభుత్వ ఉద్యోగాలు వంటివి ఓసీఐ హోల్డర్లకు వర్తించవు.
అలాగే వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లను కొనుగోలు చేయడానికి వీరికి అనుమతి లేదు. భారత రాజ్యాంగం ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కులు భారతీయ పౌరులకే ప్రత్యేకంగా వర్తిస్తాయి కానీ విదేశీయులకు ఆ సంపూర్ణ హక్కులు ఉండవు. ఈ నిబంధనల ఉల్లంఘన కింద విదేశీయుల చట్టం, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం విదేశీ పౌరులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయ.

More Stories
సుప్రీంకోర్టుకు రాహుల్ యాత్రపై సిజెఐ సీరియస్
ఇస్లాంలోకి మారినవారికి బీసీ రిజర్వేషన్ అర్హత లేదు.. సుప్రీం స్పష్టం
రైఫిల్ జామ్ కావడంతో అమెరికా గుడిలో తప్పిన కాల్పులు!