ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది ఉత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ, పద్మశ్రీ మురళీమోహన్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తన జీవిత ప్రస్థానంతో పాటు నటనా ప్రస్థానం కూడా విజయవాడ నుంచే ప్రారంభమైందని తెలిపారు. చిత్ర పరిశ్రమను మరో ప్రాంతానికి తరలించడం అంత సులభమైన విషయం కాదని, అందుకు ఎన్నో సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.
ఈలోగా ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఎక్కువగా సినిమా షూటింగ్‌లు నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. తనను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసిన ఫిల్మ్ ఛాంబర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహన కృష్ణ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు ఛాంబర్ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
అవసరంలో ఉన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఛాంబర్ తనవంతు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, ప్రోత్సాహానికి భవిష్యత్తులోనూ కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత ఏ.ఎం. రత్నం, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, కోమటి జయరాం, రిలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి లయ, నటుడు, నిర్మాత కొణిదెల నిహారిక, కళాకారుడు జో శర్మలను కూడా పురస్కారాలతో సత్కరించారు.
‘కమిటీ కుర్రోళ్లు’, ‘35 – చిన్న కథ కాదు’ చిత్రాల బృందాలతో పాటు పలువురు వ్యక్తిగత కళాకారులకు అవార్డులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో విజేతలకు కూడా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని ఛాంబర్ కార్యదర్శి మోహన్‌గౌడ్, ఇతర కార్యవర్గ సభ్యులు నిర్వహించారు. జి. సత్యానందిని, బి. రూపశ్రీ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కల్యాణి, సత్య సినీ గీతాలను ఆలపించగా, పద్మశ్రీ బృందం శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించింది. లేఖ్య భరణి కథక్ నృత్యంతో అలరించగా, రమేష్ మిమిక్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

More Stories
ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం
ఇంటి నుంచే దుర్గమ్మ దర్శనం టికెట్లు బుకింగ్
ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కీలక ముందడుగు