దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో ఉన్న మొత్తం 11 విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను జారీ చేశారు. ఈ విమానాశ్రయాలకు సంబంధించిన నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ప్రైవేటుకు అప్పగిస్తారు.. ఆధునికీరణ, మౌలిక సదుపాయాలు అప్‌గ్రేడ్, ఆదాయాన్ని (రిటైల్, కార్గో, వాణిజ్య) పెంచుకోవాలని ఏఏఐ భావిస్తోంది.
కేంద్రం ప్రతిపాదించిన 11 విమానాశ్రయాలను ఐదు బండిల్స్‌గా విభజించి ప్రైవేట్‌కు లీజుకు ఇవ్వనున్నారు. ఇటీవల ఈ ప్రతిపాదనకు పౌర విమానయానశాఖ నుంచి ఆమోదం లభించింది. 2020లో ఓ ఐదు విమానాశ్రయాల నిర్వహణను ఏఏఐ ప్రైవేటుకు అప్పగించింది. ఇప్పుడు మొదటిసారి బండ్లింగ్ విధానంలో ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది.
ఏపీలో తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు ఆపరేటర్‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను బండ్లింగ్ చేసి ప్రైవేటీకరించనున్నారు. కేంద్రం ఇటీవల పీపీపీఏసీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ) సమావేశంలో తిరుపతి, తిరుచిరాపల్లి విమానాశ్రయాలను బండ్లింగ్ చేసి ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉండే విమానాశ్రయాన్ని, తక్కువ రద్దీ ఉండే ఎయిర్‌పోర్ట్‌తో బ్లండింగ్ చేయాలని నిర్ణయించారు.
ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో విమానాశ్రయంలో రద్దీ పెరుగుతుంది. తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా పలు దేశంలోని ప్రధాన నగరాలు, ఏపీలోని విజయవాడ, భోగాపురం, రాజమహేంద్రవరానికి కూడా ప్రతి రోజూ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ, ఆర్థికంగా పనితీరు, ఇతర సదుపాయాలను పరిశీలించిన అనంతరం తిరుపతి, తిరుచిరాపల్లి విమానాశ్రయాలను బండ్లింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ తిరుపతి, తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లను కలపడం ద్వారా కొత్త పెట్టుబడుల ఆకర్షణ, నిర్వహణ సామర్థ్యం, వాణిజ్యపరంగా అభివృద్ధి వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్ట్‌లో వయబిలిటీ ఉంటుంది.. దానిని తక్కువ రద్దీ ఉండే విమానాశ్రయంతో బ్లండింగ్ చేస్తే వయబులిటీని పెంచాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ పెరిగే దానిని బట్టి అభివృద్ధి పనులను ప్రైవేటు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. త్వరలో ఈ రెండు విమానాశ్రయాల బ్లండింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది.
అంతేకాదు ఏపీలో ఏఏఐ నిర్వహణలో ఉన్న రాజమహేంద్రవరం, కడప ఎయిర్‌పోర్ట్‌లను కూడా బండ్లింగ్ విధానంలో అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు విమానాశ్రయాల్లో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ రెండు విమానాశ్రయాల సర్వీసులు, ప్రయాణికులు పెరిగిన తర్వాత ఈ రెండిటిని బండ్లింగ్ విధానంలో ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

More Stories
అలరించిన సంప్రదాయ కూచిపూడి నృత్యం, హరికథ కళారూపాలు
ఎన్నికల సంఘం ఏకగ్రీవ వివరణతో అన్ని అపోహలకు తెరపడింది
నెహ్రూ సోషలిజాన్ని వర్తింపచేసే ప్రయత్నంతో దేశం వెనుకంజ