2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి చివరిది!

భారత స్టార్ క్రికెటర్, పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ తన కేరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తనకు చివరిదని కోహ్లీ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కోహ్లీ.. ‘2027 ప్రపంచ కప్‌ను గెలవడమే నా ప్రధాన లక్ష్యమని, అందుకోసం తన శక్తినంతా ధారపోస్తాను’ అని స్పష్టం చేశాడు.   ఫామ్‌, ఫిట్‌నెస్ రీత్యా పటిష్టంగా ఉన్న విరాట్‌ మరోసారి భారత జట్టు విజయాల్లో కీలకం అవుతాడని మాజీ ఆటగాళ్లు, అభిమానులు విశ్వసిస్తున్నారు. చేశాడు. ‘దేశం తరుఫున నేను ఆడబోతున్న చివరి వరల్డ్‌కప్ ఇదే. ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి’ అని వెల్లడించాడీ రన్ మెషీన్.
 
“నేను భారత జట్టు తరఫున ఆడనున్న చివరి వరల్డ్‌కప్‌. ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే వరల్డ్‌కప్ గెలుపొందడమే మా టార్గెట్. అయితే మెగా టోర్నీలో ఎంత వరకు వెళ్లినా సరే. అందుకు నేను సిద్ధంగా ఉన్నా” అని విరాట్ తెలిపాడు. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్నందున ఒత్తిడి, అంచనాలు ఉండడం సహజమేనని అంగీకరించిన కోహ్లీ తాను మాత్రం స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

“ఇప్పుడు ఆట పరంగా ఏం మారిందంటే.. నేను స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నా. నాపై అభిమానులు పెట్టుకున్న అంచనాల గురించి ఇక ఆందోళన చెందను. చాలా ఏళ్లుగా జట్టులో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. మిడిలార్డర్‌కు స్థిరత్వం తీసుకురావడాన్ని కొనసాగిస్తాను. ఆటలో వైవిధ్యం చూపేందుకు నేను కృషి చేస్తా” అని చెప్పుకొంటూ వచ్చాడు. 

“అప్పుడు మనకు 30- 40 పరుగులు వస్తాయి. అలాఅని రిస్క్ తీసుకోను. ఇన్నింగ్స్ మధ్యలో అవసరాన్ని బట్టి దూకుడు.. సంయమనం పాటించడం ముఖ్యమని నాకు తెలుసు. ఇటీవల వన్డేల్లో ఆట చాలా మారిపోయింది. చాలా జట్లు 340 నుంచి 350 రన్స్ కొడుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా 350 నుంచి 360 కొట్టాలి. నేను క్రీజులో ఉండి రిస్క్ తీసుకుంటే భారత జట్ట అలవోకగా 360కి పైగా స్కోర్ చేస్తుంది” అంటూ భరోసా వ్యక్తం చేసాడు. 

“మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లనే ఇటీవల స్వేచ్ఛగా ఆడుతున్నా” అని విరాట్ వెల్లడించాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా వరల్డ్‌కప్ జరుగనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. 37 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

కోహ్లీకి 2027 ప్రపంచకప్ ఐదో వన్డే ప్రపంచకప్ కానుంది. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ 2015, 2019, 2023 ప్రపంచ కప్‌లలోనూ ఆడాడు. 2023లో భారత్ ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురవడంతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు వన్డేల్లో 54 సెంచరీలు చేసిన కోహ్లీ, వన్డే పరుగుల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  

ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన కోహ్లీ, 37 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 59.83 సగటుతో 1,795 పరుగులు సాధించాడు. అతని ప్రపంచ కప్ రికార్డులో ఐదు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి; ఇందులో అతని అత్యధిక స్కోరు 117. భారత మాజీ కెప్టెన్ అయిన కోహ్లీ, 302 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.59 సగటుతో మొత్తం 14,941 పరుగులు చేశాడు. ఇందులో 54 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 183.

 

 

 

About The Author