“ఇప్పుడు ఆట పరంగా ఏం మారిందంటే.. నేను స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నా. నాపై అభిమానులు పెట్టుకున్న అంచనాల గురించి ఇక ఆందోళన చెందను. చాలా ఏళ్లుగా జట్టులో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. మిడిలార్డర్‌కు స్థిరత్వం తీసుకురావడాన్ని కొనసాగిస్తాను. ఆటలో వైవిధ్యం చూపేందుకు నేను కృషి చేస్తా” అని చెప్పుకొంటూ వచ్చాడు.
“అప్పుడు మనకు 30- 40 పరుగులు వస్తాయి. అలాఅని రిస్క్ తీసుకోను. ఇన్నింగ్స్ మధ్యలో అవసరాన్ని బట్టి దూకుడు.. సంయమనం పాటించడం ముఖ్యమని నాకు తెలుసు. ఇటీవల వన్డేల్లో ఆట చాలా మారిపోయింది. చాలా జట్లు 340 నుంచి 350 రన్స్ కొడుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా 350 నుంచి 360 కొట్టాలి. నేను క్రీజులో ఉండి రిస్క్ తీసుకుంటే భారత జట్ట అలవోకగా 360కి పైగా స్కోర్ చేస్తుంది” అంటూ భరోసా వ్యక్తం చేసాడు.
“మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లనే ఇటీవల స్వేచ్ఛగా ఆడుతున్నా” అని విరాట్ వెల్లడించాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా వరల్డ్‌కప్ జరుగనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. 37 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కోహ్లీకి 2027 ప్రపంచకప్ ఐదో వన్డే ప్రపంచకప్ కానుంది. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ 2015, 2019, 2023 ప్రపంచ కప్‌లలోనూ ఆడాడు. 2023లో భారత్ ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురవడంతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు వన్డేల్లో 54 సెంచరీలు చేసిన కోహ్లీ, వన్డే పరుగుల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన కోహ్లీ, 37 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 59.83 సగటుతో 1,795 పరుగులు సాధించాడు. అతని ప్రపంచ కప్ రికార్డులో ఐదు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి; ఇందులో అతని అత్యధిక స్కోరు 117. భారత మాజీ కెప్టెన్ అయిన కోహ్లీ, 302 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.59 సగటుతో మొత్తం 14,941 పరుగులు చేశాడు. ఇందులో 54 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 183.

More Stories
బద్రీనాథ్‌లో భారత సైన్యం `సంగీత కచేరీ’పై దుమారం
ఈసీలో ఓటర్ల జాబితాను నిర్వహించే సాఫ్ట్‌వేర్‌పై సమీక్ష
నెహ్రూ సోషలిజాన్ని వర్తింపచేసే ప్రయత్నంతో దేశం వెనుకంజ