ఓటర్ల జాబితా సవరణల వ్యవహారం ఎన్నికల సంఘం (ఈసీఐ)లో అంతర్గత విభేదాలకు దారితీసిన్నట్లు కధనాలు వెలువడిన నేపథ్యంలో ఓటర్ల జాబితాను నిర్వహించే సాఫ్ట్‌వేర్‌పై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సాఫ్ట్‌వేర్ ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందా? అందులో మార్పులు చేసే విధానం నిబంధనలకు లోబడి ఉందా? అన్న అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ కమిటీకి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (డిఈసి) నేతృత్వం వహిస్తారు మరియు ఇందులో ఐఐటి లేదా ఐఐఐటికి చెందిన ఒక స్వతంత్ర నిపుణుడు సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను కమిషన్‌కు సమర్పిస్తుంది. శనివారం జరిగిన కమిషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం సభ్యుల మధ్య ‘అసమ్మతి’ ఉందని పేర్కొంటూ వచ్చిన ఒక నివేదికపై వివాదం చెలరేగిన నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో, భారత ఎన్నికల సంఘం శనివారం ఎస్ఐఆర్ డ్రైవ్‌కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల మధ్య ఈ సమావేశం జరిగింది.
క్షేత్రస్థాయి అధికారులు తమ చట్టబద్ధమైన అధికారాలకు అనుగుణంగా ప్రస్తుతం ECINETను వినియోగించుకునేందుకు (రోల్-బేస్డ్ యాక్సెస్) వీలుందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల నుంచి అందిన సూచనల ఆధారంగా ఈ పోర్టల్‌లో ఇప్పటికే పలు మెరుగుదలలు చేసినట్లు కూడా కమిషన్ పేర్కొంది.
క్షేత్రస్థాయి అధికారులు కోరే అదనపు వెసులుబాటును అమలు చేస్తామని కమిషన్ తెలిపింది. అలాగే, ఐటీ మాడ్యూల్స్, పోర్టల్స్‌కు సంబంధించిన అన్ని కొత్త కార్యక్రమాలను ఇకపై కమిషన్ ఆమోదం కోసం సమర్పించే ముందే అధికారుల కమిటీలో చర్చించాలని కూడా నిర్ణయించింది. కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించిన మరో నిర్ణయంలో, మ్యాపింగ్‌లో లేకపోవడం లేదా తార్కిక వ్యత్యాసాలు ఉన్నందున నోటీసులు జారీ చేయబడిన ప్రజల ఇళ్లను బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) సందర్శిస్తారని ఈసిఐ తెలిపింది.
“దీనిని సులభతరం చేయాలని సీఈఓలను ఆదేశించడం జరిగింది. ఈ ఓటర్ల నమోదు కోసం సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు తక్షణమే ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభిస్తారు,” అని అది జోడించింది. ఈ వారం ప్రారంభంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‘ నివేదిక ప్రకారం, సంధు, జోషి క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖపై కూడా ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేసింది. “క్యాబినెట్ సెక్రటరీకి రాసిన లేఖ కమిషన్ లేదా ఐటీ విభాగానికి సంబంధించిన ఏ విధానపరమైన విషయానికి సంబంధించింది కాదు. కానీ ఈసీఐకి డిప్యూటేషన్‌పై వచ్చిన ఒక అధికారి పనితీరుకు సంబంధించినది,” అని పత్రికా ప్రకటనలో పేర్కొంది.

More Stories
2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి చివరిది!
బద్రీనాథ్‌లో భారత సైన్యం `సంగీత కచేరీ’పై దుమారం
నెహ్రూ సోషలిజాన్ని వర్తింపచేసే ప్రయత్నంతో దేశం వెనుకంజ