మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌తో రూ. 94,000 కోట్ల అక్ర‌మార్జ‌న‌

 
* హైదరాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రధాన సూత్రధారి  అభషేక్ కుమార్‌ అరెస్ట్ 

 గ‌డిచిన ప‌దేళ్ల‌లో మ‌హాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ తో సుమారు రూ. 94,400 కోట్లు అక్ర‌మంగా ఆర్జించిన‌ట్లు ఈడీ త‌న తాజా ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న‌ది. రాయ్‌పూర్ కోర్టులో ఈ విష‌యాన్ని ఈడీ వెల్ల‌డించింది. ఇంకా ఆ మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ఆప‌రేష‌న్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. ఈ కేసులో ఆరోసారి ఈడీ త‌న ఛార్జ్‌షీట్‌ను కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టింది. మ‌నీల్యాండ‌రింగ్ కోర్టు ముందు ఆ రిపోర్టును ఉంచింది. 

మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్‌తో సుమారు 42 మంది వ్య‌క్తులు, కంపెనీల‌కు లింకు ఉన్న‌ట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ప్ర‌మోట‌ర్లు, ప్యానెల్ స‌భ్యులు సెంట్ర‌ల్ ఇండియాకు చెందిన‌వార‌ని, అక్ర‌మ బెట్టింగ్ వెబ్‌సైట్ల‌తో మ‌హాదేవ్ యాప్‌ను నిర్వ‌హించిన‌ట్లు గుర్తించామ‌ని ఈడీ కోర్టులో చెప్పింది. మ‌హాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్‌ను వాట్సాప్‌, టెలిగ్రాం, ఫేస్‌బుక్ పేజీల‌తో ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు ఈడీ తెలిపింది. 

ఆ లింకుల‌తో వేలాది మంది యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. చ‌త్తీస్‌ఘ‌డ్‌, ఏపీ, బెంగాల్‌లో న‌మోదు అయిన కేసుల ఆధారంగా 2022 అక్టోబ‌ర్‌లో మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. 2019 నుంచి మ‌హాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా సుమారు 80 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు తెలుస్తోంద‌ని ఈడీ పేర్కొన్న‌ది.  మ‌హాదేవ్ సిస్ట‌ర్ వెబ్‌సైట్లు Skyexchange.com , Lotus365.com కూడా వేల కోట్లు ఆర్జించిన‌ట్లు ఈడీ పేర్కొన్న‌ది.

పోక‌ర్, కార్డ్ గేమ్స్‌, ఛాన్స్ గేమ్స్‌, క్రికెట్ , బ్యాడ్మింట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్ బెట్టింగ్‌ను మ‌హాదేవ్ యాప్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రోత్స‌హించారు. తీన్ ప‌త్తి, డ్రాగ‌న్ టైగ‌ర్‌, వ‌ర్చువ‌ల్ క్రికెట్ గేమ్స్ కూడా కార్డు ద్వారా ఆడుతారు.

కాగా, మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులలో ఒకడిగా, వాంటెడ్ నిందితుడిగా ఉన్న అభిషేక్ కుమార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కొద్దిసేపటికే అతడిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం, మహాదేవ్ బుక్ పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం కార్యకలాపాలను నడపడంలో కుమార్ చురుకైన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 
బెట్టింగ్, జూదం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి ప్యానెళ్లను సమన్వయం చేయడం, నిధులు సేకరించడం, దుబాయ్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడంలో అతడు పాలుపంచుకున్నాడని సీబీఐ తెలిపింది. అరెస్టు చేసిన వెంటనే కుమార్‌తో జరిపిన సోదాల్లో, అతడి వద్ద నేరారోపణకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను నడపడంలో అతడి చురుకైన పాత్రను ఈ సామాగ్రి ప్రాథమికంగా సూచిస్తోందని సీబీఐ పేర్కొంది. 
 
సౌరభ్ చంద్రకర్, శుభం సోనిలతో సహా ఇతర ప్రధాన నిందితులతో కుమార్ సన్నిహితంగా పనిచేశాడని కూడా ఏజెన్సీ తెలిపింది. అరెస్టు అనంతరం, కుమార్‌ను హైదరాబాద్‌లోని స్థానిక కోర్టులో హాజరుపరచగా, సీబీఐ మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను పొందింది. అనంతరం అతడిని రాయ్‌పూర్‌కు తీసుకెళ్లి అక్కడి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ రిమాండ్‌ను మంజూరు చేసింది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐకి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ ఈ కేసులను స్వీకరిం ఇప్పటివరకు100 మంది నిందితులపై ఎనిమిది ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లు, ప్యానెల్ ఆపరేటర్లు, హవాలా ఆపరేటర్లు మరియు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. పరారీలో ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా, దర్యాప్తు కూడా కొనసాగుతోంది.

About The Author