* కొత్త ఇన్‌ఛార్జ్‌లు, సహ-ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బిజెపి
భారతీయ జనతా పార్టీ తన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు, సహ-ఇన్‌ఛార్జ్‌లను పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నియమించారు. పలువురు సీనియర్ నాయకులకు సంస్థాగత బాధ్యతలను అప్పగించారు. పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఒడిశాకు దగ్గుబాటి పురందేశ్వరిని నియమించగా, సునీల్ బన్సాల్‌ను పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.
రామ్ మాధవ్‌ను ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఛత్తీస్‌గఢ్, హర్యానా రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, ఆ రెండు రాష్ట్రాలకు సిద్ధార్థ్ శంభు కో-ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. హరీష్ ద్వివేదిని బీహార్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. వినోద్ తావ్డేను పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అలాగే జగదీష్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ వర్మ, అనంత ఓజాలను సహ-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.
తరుణ్ చుగ్‌ను గుజరాత్ ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, సతీష్ పూనియా జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అనిల్ ఆంటోనీని గోవా, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను సహ ఇన్‌చార్జులుగా నియమించారు. డీకే అరుణకు తమిళ నాడు సహ ఇంఛార్జ్ గా, తెలంగాణ ఉపాధ్యక్షుడు డా. కోసం వెంకటేశ్వర్లు కర్ణాటక సహా ఇంచార్జ్ గా బాధ్యతలు కేటాయించారు.
మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా నియమితులవ్వగా, అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తానవాడే, కమల్‌జీత్ సెహ్రావత్ కో-ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జాతీయ మీడియా విభాగం, సోషల్ మీడియా యూనిట్‌ను కలుపుకునే కమ్యూనికేషన్ విభాగానికి అనిల్ బలూనీ సమన్వయకర్త నియమితులయ్యారు. ఇటీవల నేషనల్ మీడియా విభాగం కో-కన్వీనర్‌గా నియమితులైన ఆషిశ్ ఉషా అగర్వాల్‌లకు కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.
అండమాన్ అండ్ నికోబార్- జై ప్రకాష్ (ఢిల్లీ), అరుణాచల్ ప్రదేశ్ దేవేష్ కుమార్ (బిహార్), అస్సాం మంగళ్ పాండే, ఫాంగ్నోన్ కొన్యాక్ మనోజ్ తిగ్గగా; బిహార్ హరీష్ ద్వివేది, సంగీత యాదవ్- రోహన్ గుప్తా;చండీగఢ్ మహేంద్ర పాండే, దాద్రా నగర్ హవేలీ, దమన్ డయ్యూ వర్షబెన్ నరేంద్ర భాయ్ దోషి, ఢిల్లీ వినయ్ సహస్రబుద్ధే, జమ్యాంగ్ త్సెరింగ్ నమ్గ్యాల్- దర్శన జర్దోష్, గోవా భారతి ప్రవీణ్ పవార్, అనిల్ ఆంటోని, గుజరాత్ తరుణ్ చుగ్, అజయ్ మహావార్- గోమతి సాయి, హిమాచల్ ప్రదేశ్ శ్రీకాంత్ శర్మ, దర్శన సింగ్; జమ్మూ కశ్మీర్ సతీష్ పూనియా, రీనా కశ్యప్; ఝార్ఖండ్ గజేంద్ర పటేల్- సౌరభ్ సింగ్, నివేదిత సింగ్, లడఖ్ రాజ్‌కుమార్ భాటియాలను నియమించారు.
లక్షద్వీప్ జార్జ్ కురియన్, మధ్యప్రదేశ్ బాబుల్ కుమార్ దేబ్, రేఖా వర్మ, మణిపూర్ రాజ్‌దీప్ రాయ్ , మేఘాలయ కనద్ పుర్కాయస్థ, నుమాల్ మోమిన్, మిజోరాం భగవత్ కరద్; నాగాలాండ్ అనిల్ ఆంటోని, పుదుచ్చేరి కె. సురేంద్రన్- పంజాబ్ సతీష్ పూనియా, వీరేంద్ర సచ్‌దేవా, అల్కా గుర్జర్.. రాజస్థాన్ సంజయ్ భాటియా, కవితా పాటిదార్, కుల్జీత్ చాహల్; సిక్కిం రాజు బిస్తా, త్రిపుర మృగాంక దేబ్ బర్మన్, ఉత్తరాఖండ్ రామ్ మాధవ్ అరవింద్ మీనన్, బాన్సూరి స్వరాజ్, పశ్చిమ బెంగాల్ సునీల్ బన్సల్ లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహలను నియమించారు.
More Stories
‘ఓట్ల చోరీ’ ఆరోపణలను తిరస్కరించిన బిజెపి
8 మంది ఎమ్మెల్యేల చేరికతో మేఘాలయలో రెండో అతి పార్టీగా బిజెపి
దిగొచ్చిన సర్కార్.. జూరాలకు కుడి, ఎడమ కాలువకు నీటి విడుదల