మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఆయన నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు సంబంధించిన 7 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి, మణికొండ, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో ఆయనకు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఏసీబీ అధికారులు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ, ఆయా ఆస్తుల మారెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఏసీబీ తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.80 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. అలాగే యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లతో పాటు విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ గుర్తించామని చెప్పారు.
అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీసులో రూ.12 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షలు పెట్టుబడులు పెట్టినట్లు కనుగొన్నామని ఏసీబీ అధికారులు వివరించారు. దీంతో పాటు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారమని ఏసీబీ అధికారులు తెలిపారు.
జాగ్వార్, ఆడీ, టాటా నెక్సాన్ సహా 3 కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా వంటి నాలుగు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారమని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉన్నాయని కూడా చెప్పారు. వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తమ సోదాల్లో గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అలాగే తన సన్నిహితులకు రూ.1.33 కోట్లు అప్పుగా లక్ష్మీ భాస్కర్ ఇచ్చినట్లు గుర్తించామన్నారు. ఆయన అదనపు ఆస్తులపై వెరిఫికేషన్ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వివరించారు.

More Stories
22ఏ భూముల వివాదంలో ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఆంక్షలపై ఉత్సవ సమితి నిరసనలు
హుస్సేన్ సాగర్‌లో యథావిధిగా నిమజ్జనాలకు అనుమతివ్వాలి