2026 ఆసియా క్రీడల రెండో రోజు ప్రారంభ దశలో భారత బృందం మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి రోజు రెండు పతకాలు సాధించిన భారత్, రెండో రోజు సగం సమయం గడిచేసరికి మరో నాలుగు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత షూటర్లు ఆసియా గేమ్స్ పోటీల తొలి రోజే అదరగొట్టారు. స్టార్ షూటర్ ఇలవేనిల్ వలారివన్ ముందుండి నడిపించగా రెండు రజత పతకాలతో శుభారంభం చేశారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఇలవేనిల్ డబుల్ ధమాకా మోగించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో తమిళనాడుకు చెందిన వలారివన్ 0.6 పాయింట్ల తేడాతో కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. తను 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఆతిథ్య జపాన్‌కు చెందిన హినాటా తైచి 253.0 పాయింట్లతో ఆసియా గేమ్స్ రికార్డు నమోదు చేస్తూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
తొలుత, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్, హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానే కలిసి రజత పతకాన్ని సాధించారు. ఐచి ప్రిఫెక్చురల్ జనరల్ షూటింగ్ గ్యాలరీలో జరిగిన ఈ పోటీలో, ఈ భారత త్రయం మొత్తం 1890.1 పాయింట్లను నమోదు చేసింది. 1899.0 పాయింట్లతో క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన చైనాకు చెందిన షెంగ్ లిహావ్, మా సిహాన్, జాంగ్ చాంగ్హాంగ్ల వెనుక వీరు నిలిచారు.

More Stories
బంగ్లాపై భారీ విజయంతో ఫైనల్లో భారత మహిళల జట్టు
రష్యాపై వేయి డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయన్.. ఇద్దరు మృతి
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై మరో ఏడాది పాటు లక్ష డాలర్ల ఫీజు