వచ్చే నెలలో జర్మనీ తన ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ (ఏఎఫ్‌డీ) సాధించిన విజయం, దేశం ఎంతగా విభజించబడిందో బహిర్గతం చేసింది. బెర్లిన్ గోడ కూలిన 36 సంవత్సరాల తర్వాత కూడా, మాజీ కమ్యూనిస్ట్ తూర్పు ప్రాంతం మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరో దేశంగానే మిగిలిపోయింది.
ఈ తూర్పు రాష్ట్ర ఎన్నికలలో ఏఎఫ్‌డీ సాధించిన అపూర్వమైన ప్రదర్శన, దాని సరిహద్దులకు ఆవల కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చనే ఆందోళన కలిగిస్తుంది.
క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీ (సిడియు) అభ్యర్థి ఫ్రీడ్రిక్ మెర్జ్ చాలా వెనుకబడి రెండవ స్థానంలో నిలిచిన తర్వాత పూర్తిస్థాయి సంక్షోభంలో ఉంది. ఒక ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఏఎఫ్‌డీ ఆశ్చర్యకరంగా 44.5 శాతం ఓట్లను సాధించింది. సిడియు 18.5 శాతంతో వెనుకబడి ఉంది. ఇది ఎన్నికలకు ముందు జరిగిన పోలింగ్ అంచనాల కంటే కూడా దారుణమైన పరిస్థితి.
ఆదివారం సాక్సోనీ-అన్హాల్ట్లో మొదటి స్థానంలో నిలిచిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓటమి తర్వాత తొలిసారిగా జర్మనీలో రాష్ట్ర స్థాయిలో ఒక `రైట్ వింగ్ పార్టీ’ అధికారానికి చేరువయ్యింది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) 44 శాతం ఓట్లను గెలుచుకుంది. ఇది సంపూర్ణ మెజారిటీకి చేరకపోయినా, దాని విస్తృత రాజకీయ ప్రాముఖ్యతను స్పష్టం చేసింది.
ఏఎఫ్‌డీకి చెందిన 35 ఏళ్ల రాజకీయ నాయకుడు ఉల్రిచ్ సిగ్మండ్, తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలో ఏఎఫ్‌డీ కి నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఫలితం. దీనితో సిగ్మండ్ హిట్లర్ శకం తర్వాత ఒక జర్మన్ రాష్ట్రానికి మొదటి `రైట్ వింగ్’ నాయకుడిగా నిలిచే అవకాశం ఉంది. జర్మన్ పునరేకీకరణ జరిగిన కొద్ది వారాలకే, అక్టోబర్ 1990లో సాక్సోనీ-అన్హాల్ట్లో జన్మించిన సిగ్మండ్, ఇప్పటికీ తన భార్య, కుమార్తెలతో కలిసి తన స్వస్థలమైన టాంగర్ముండేలో నివసిస్తున్నారు.
రాజకీయాల్లోకి రాకముందు, అతను బిజినెస్ సైకాలజీ చదివి, ఎయిర్ ఫ్రెషనర్లను విక్రయించే ఒక చిన్న కంపెనీని నడిపారు. బెర్లిన్‌కు పశ్చిమాన ఉన్న 21 లక్షల జనాభా గల ప్రాంతంలో, ఏఎఫ్‌డీ 43.8% ఓట్లను గెలుచుకుంది. ఇది ఐదేళ్ల క్రితం దానికున్న ఓట్ల కంటే రెట్టింపుకు పైగా ఉంది. ఇది మెర్జ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కంటే చాలా ముందుంది. ఆ పార్టీ 17.2% ఓట్లను పొందింది. తన మద్దతులో దాదాపు సగాన్ని కోల్పోయింది. 15 సీట్లను గెలుచుకుంది.
మధ్య-వామపక్ష సోషల్ డెమోక్రాట్స్ 9.3%, గ్రీన్స్ 8.9%, లెఫ్ట్ పార్టీ 8.6% ఓట్లను పొంది, చెరో ఎనిమిది సీట్లను గెలుచుకున్నాయి. ఈ ఫలితం జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఆయన కన్జర్వేటివ్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక జర్మన్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి ఏఎఫ్‌డీ ఇంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రీవ్ ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.
బెర్లిన్‌లో, ఈ ఫలితం ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ సిడియు ప్రధాన కార్యాలయం నుంచే ఓట్ల లెక్కింపును వీక్షించారు కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. ప్రధాన కార్యదర్శి ఫ్రాంజిస్కా హాపర్మాన్ దీనిని “మాకు చాలా కష్టమైన ఫలితం” అని అభివర్ణించగా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వెన్ షుల్జ్ ఏఎఫ్‌డీ కి కేవలం మితమైన అభినందనలు మాత్రమే తెలిపారు.
వార్సా నుండి వచ్చిన స్పందన బహిరంగంగా విమర్శనాత్మకంగా ఉంది. పోలాండ్ ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ ఎక్స్ లో రాస్తూ, “ ఏఎఫ్‌డీ విజయాన్ని చూసి మూర్ఖులు లేదా దేశద్రోహులు మాత్రమే సంతోషించగలరు,” అని పేర్కొన్నారు. ఖండంలోని ఇతర ప్రాంతాలలో, ఐరోపాలోని జనాకర్షక మితవాద వర్గాలు ఈ ఫలితాన్ని తమ విజయ ధృవీకరణగా భావించాయి.
ఇటలీ ఉప ప్రధానమంత్రి మట్టెయో సల్విని, “మరో ఐరోపా సాధ్యమే,” అని ప్రకటించారు. స్పెయిన్ వోక్స్ నాయకుడు శాంటియాగో అబాస్కల్ ఈ ఫలితాన్ని “జర్మనీకి, ఐరోపాకు ఒక గొప్ప ఆశాకిరణం” అని అభివర్ణించగా, పోర్చుగల్ అధ్యక్షుడు ఆండ్రే వెంటూరా ఏఎఫ్‌డీ విజయాన్ని “చారిత్రాత్మక” విజయంగా కొనియాడారు. వలసలపై ప్రజాగ్రహమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ భిన్నమైన ప్రతిస్పందనలు, ఒకే ఒక్క జర్మన్ ప్రాంతీయ ఎన్నిక ఐరోపా కోసం ఒక పరోక్ష పోరాటంగా ఎలా మారిందో స్పష్టం చేస్తున్నాయి. ఈ నెలలో జరగనున్న మరిన్ని జర్మన్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన స్రవంతి నాయకులు ఆందోళన చెందుతుండగా, జాతీయవాద ఉద్యమాలు ఉత్తేజితమయ్యాయి. ఎన్నికల రాత్రి, ఆ రాష్ట్రంలోని ఏఎఫ్‌డీ నాయకుడు ఇతర రాజకీయ సమూహాలు సహకరించాలని పిలుపునిచ్చారు.
“ఒక ప్రజాస్వామ్యవాదిగా, ప్రాథమిక రాజకీయ మార్పును తీసుకురావడానికి మాతో కలిసి పనిచేయాలనుకునే వారందరినీ నేను సంప్రదిస్తాను,” అని ఉల్రిచ్ సిగ్మండ్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగానే ఉంటుంది. దేశీయ నిఘా సంస్థ ఏఎఫ్‌డీని “అతివాద మితవాద పార్టీ”గా వర్గీకరించింది. ఇతర రాజకీయ సమూహాలు దానితో పొత్తు పెట్టుకోవడానికి సంకోచిస్తున్నాయి.
ఏఎఫ్‌డీ తీవ్రవాద ఆరోపణలను తోసిపుచ్చింది. గత కొన్ని నెలలుగా ఎన్నికల సర్వేలలో దాని పెరుగుదలను ప్రధాన స్రవంతి పార్టీలు అడ్డుకోలేకపోయాయి. వలసలపై కఠినమైన ఆంక్షలు, రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడం, ఉక్రెయిన్‌కు మద్దతును నిలిపివేయడం, యూరో నుండి వైదొలగడం వంటి వాటికి మద్దతు ఇచ్చే ఈ పార్టీ, జాతీయ స్థాయిలో జర్మనీలో అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీ అని తాజా పోలింగ్ సూచిస్తుంది.
సాక్సనీ-అన్హాల్ట్ ఎన్నిక, 2029 జాతీయ ఎన్నికలలో అతివాద మితవాద పార్టీల చారిత్రాత్మక పునరాగమనానికి నాంది పలకవచ్చు. ఆ ఎన్నికలలో ఏఎఫ్‌డీ మొదటి స్థానంలో నిలిచేందుకు వాస్తవిక అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.

More Stories
గత పాలకుల “పరిపాలనా జడత్వం”తో ఎంతో కోల్పోయిన భారత్
ఈఫిల్ టవర్ సాధువుల సందర్శనప్పుడు మహిళా సిబ్బంది తొలగింపు!
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్