ఈ అంశంలో రష్యాతో వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని మిశ్రీ చెప్పారు. మాస్కోలోని భారతీయ ఎంబసీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భారతీయులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రష్యా సైన్యంలోని వివిధ మిలిటరీ యూనిట్లలో ఇంకా సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న మిగిలిన భారతీయులను కూడా వెంటనే డిశ్చార్జ్ చేసి విడుదల చేయాలని రష్యా ప్రభుత్వాన్ని భారత్ గట్టిగా కోరినట్లు చెప్పారు.
అధిక జీతాలు, విదేశీ ఉద్యోగాల పేరుతో ఆశచూపి రష్యాలోని ఆర్మీ సపోర్ట్ ఉద్యోగాల పేరుతో అమాయక యువతను మోసం చేస్తున్న నిరుద్యోగ నకిలీ ఏజెన్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని విదేశాంగ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇటువంటి అక్రమ రిక్రూట్మెంట్లు నిర్వహించే ఏజెంట్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, విదేశాలకు వెళ్లే ముందు భారత ప్రభుత్వం ఆమోదించిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ఉద్యోగ అవకాశాలను ఎంచుకోవాలని స్పష్టం చేసింది.

More Stories
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ
ఎస్సీవో సదస్సులో మోదీ ఫొటో కట్ చేసిన పాక్ ప్రధాని కార్యాలయం
ఉక్రెయిన్ పై రష్యా దాడిలో భారతీయుడు సహా 12 మంది మృతి