ఈ ప్రకృతి విలయంలో కనీసం 162 మంది మరణించారని, మొత్తం వేయి మందికి పైగా గల్లంతు కాగా, వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. , 37 మంది ప్రవాస భారతీయ పర్యాటకులు కూడా ఉన్నారు గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన వారు ఉన్నారని నేపాల్ పర్యాటక మండలి తెలిపింది.“గంటల వ్యవధిలోనే వరుసగా అనేక పట్టణాలు తుడిచిపెట్టుకుపోయాయి,” అని నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలపై ప్రాథమిక అంచనాలను వివరిస్తూ నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు.
టిబెట్‌లో బుధవారం 8.37 గంటలకు సంభవించిన భూకంపం కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్టు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనల్ పార్లమెంట్‌కు తెలిపారు. భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపనల వల్ల మంచుకొండు విరిగిపడ్డాయని, దీంతో వరద పోటెత్తిందని వివరించారు. ఆ వరద భోటే కోశీ నదిలో కలిసి టిబెట్‌కు సరిహద్దున ఉన్న రసువా, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తిందని తెలిపారు.
అదేసమయంలో టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లెండే నదిలో కొండచరియలు విరిగిపడటంతో నీటి మట్టం పెరిగి, ఆ నీరు కూడా భోటే కోశీ నదిలో చేరి దిగువనున్న త్రిశూలి నదిలోకి ప్రవేశించిందని జాతీయ విపత్తు నివారణ యాజమాన్యం సంస్థ వివరించింది. ఈ మూడు నదుల నీరు దాదాపు ఆరు జిల్లాలను కకావికలం చేసిందని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు భీతిగొలుపుతున్నాయి.
రాత్రి 10 గంటల సమయానికి 95 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 500 మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. కన్ని పట్టణాల్లో వరదతో కొట్టుకొచ్చిన బురద, మట్టి భవనాలను సగం వరకు ముంచెత్తింది. అంతా నిమిషాల వ్యవధిలో చూస్తుండగానే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద పెద్ద భవనాలు, బహుళ అంతస్తులు, బస్టాండ్లు, వేల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.
“నేపాల్-చైనా సరిహద్దు నదిలో ఎగువన ఇంకా ఒక అడ్డంకి ఉన్నందున, రెండవ వరద సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు,” అని ఆయన ఏఎఫ్పీకి తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది ఉన్నట్టు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. నేపాల్ వెళ్లిన హైదరాబాద్, కర్నూలుకు చెందిన సుమారు 300 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలియవచ్చింది.
జాడ లేని 384 మంది కైలాస్ యాత్రికులు
కైలాస్ మానససరోవర్ యాత్రకు సంబంధించిన 384 మంది యాత్రికులు రసువాగధి సరిహద్దు ప్రాంతంలో బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు. ఈ యాత్రను రద్దు చేస్తూ నేపాల్ ప్రభుత్వం లేదా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రానున్న 48-72 గంటల పాటు యాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్టు ఖాట్మండులోని టూర్ ఆపరేటర్లు ధృవీకరించారు.
నేపాల్ పర్యాటక బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం 384 మంది యాత్రికులు అదృశ్యమయ్యారు లేదా వారితో సంబంధాలు తెగిపోయాయి. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. వీరు కైలాస్ మానసరోవర్ యాత్ర కోసం బుధవారం టిబెట్‌లోకి ప్రవేశించాల్సి ఉంది.

More Stories
రాజీనామాకు సురేఖ ససేమీరా… భర్తరఫ్ చేస్తే తిరుగుబాటు!
నేపాల్‌కు రాష్ట్రపతి, ప్రధాని సంఘీభావం.. భారత్ అప్రమత్తం
రోహింగ్యా, మైనార్టీ హక్కుల ఐరాస నివేదికపై తీవ్ర ఆగ్రహం!