* 20 తర్వాత పర్యటించే అవకాశం.. హసీనా అప్పగింత తేల్చేది భారతీయ కోర్టులే!
పదవీచ్యుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశంలో కొనసాగడం, ఆమె ఇటీవలి ప్రకటనలు, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ పర్యటనతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై అవి చూపే ప్రతికూల ప్రభావంపై ఢిల్లీ, ఢాకాల మధ్య ఉధృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 21న జరగాల్సిన రెహమాన్ పర్యటన ఇప్పుడు దౌత్యపరంగా చర్చనీయాంశంగా మారింది.
రెహమాన్ ప్రధాని అయిన ఆరు నెలల తర్వాత తిరిగి తలెత్తిన ఈ సంబంధాలలోని గందరగోళాన్ని పరిష్కరించేందుకు భారత, బంగ్లాదేశ్ దౌత్యవేత్తలు, భద్రతా అధికారులు కృషి చేస్తున్నారు. కొంతకాలంగా సమస్యలు ముదురుతున్నప్పటికీ, హింసాత్మక నిరసనల కారణంగా తన ప్రభుత్వం కూలిపోయి, భారతదేశంలో ఆశ్రయం పొంది రెండేళ్లయిన సందర్భంగా ఆగస్టు 5న హసీనా చేసిన ప్రకటన తాజా రెచ్చగొట్టే చర్యగా నిలిచింది.
బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలన్న అభ్యర్థనను తారిక్ రెహమాన్ ప్రభుత్వం పునరుద్ఘాటించగా, ఇటువంటి అభ్యర్థనలు భారత న్యాయవ్యవస్థ ముందుకు వచ్చి, దాని ద్వారానే నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలోని ఉన్నత ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే, ఇంతటి తీవ్రమైన వైఖరి నుండి వైదొలగేందుకు ఢాకాతో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని వారు జోడించారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో తన దేశానికి తిరిగి రావాలని యోచిస్తున్నట్లు షేక్ హసీనా స్వయంగా చెప్పారని మరో అధికారి తెలిపారు. ఈ అప్పగింత అభ్యర్థనను ఢిల్లీ, ఢాకాల మధ్య జరుగుతున్న ప్రస్తుత దౌత్యపరమైన సంప్రదింపుల నుండి వేరు చేయలేమని ఆ అధికారి స్పష్టం చేశారు. మరోవంక,
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ఈ నెలలోనే భారత్ లో పర్యటించబోతున్నారని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది.
మీడియా కథనం ప్రకారం ఆయన ఆగష్టు 20-25 తేదీల మధ్య భారత్ లో పర్యటిస్తారు. వీటిలో కచ్చితమైన తేదీల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆగష్టు 20, 21 తేదీల్లో లేదా ఆగష్టు 21, 22 తేదీల్లో ఆయన పర్యటన ఉండొచ్చు. ఈ పర్యటనలో రహమాన్ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో భారత్ -బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
బంగ్లాలో హిందువులపై దాడి విషయంలో ఆ దేశంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఇదే సమయంలో తమ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లా వ్యతిరేకతతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగు కోసం బంగ్లా ప్రధాని పర్యటన కీలక కానుంది. ఆయన పర్యటన సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.
ఆగస్టు 11న బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. “ద్వైపాక్షిక పర్యటనపై ఇరుపక్షాలు ఆసక్తిగా ఉన్నాయి, కానీ షెడ్యూల్ ఒక సమస్యగా మారింది. వివిధ షెడ్యూళ్లను పరిశీలించిన తర్వాత, ఇరు దేశాల ఉన్నతాధికారులు ఆగస్టు 20 నుంచి 25 మధ్య పర్యటనకు ఒక నిర్ణయానికి వచ్చారు,” అని న్యూఢిల్లీలోని ఒక ఉన్నత దౌత్య వర్గాన్ని ఉటంకిస్తూ ‘ది డైలీ స్టార్’ నివేదించింది.
బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ప్రజల-ప్రజల సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “ఉమ్మడి ఆకాంక్షలు, పరస్పర సద్భావనలో పాతుకుపోయిన ప్రజల-ప్రజల సంబంధమే ఈ శాశ్వత స్నేహానికి నిజమైన ప్రాణంగా నిలుస్తుందని మేము గుర్తిస్తున్నాము,” అని ఆయన తెలిపారు. త్రివేది ప్రకారం, ఇరు దేశాలు వాణిజ్యం, కనెక్టివిటీ, భద్రత, ఆరోగ్య సంరక్షణతో సహా ఇతర కీలక రంగాలలో తమ సంబంధాలను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

More Stories
నల్సార్ వివాదంలో బార్ కౌన్సిల్ చైర్మన్ క్షమాపణలు
`వికసిత్ భారత్’ కోసం ప్రధాని మోదీ `సప్తధార’ సంస్కరణలు
హోర్ముజ్ జలసంధి ఇరాన్‌దే…యుద్ధనౌకలతో సొంతం చేసుకోలేరు!