నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ సినిమా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు సినీ జగత్తులో వినిపిస్తున్న మాట. దీంతో ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించనుంది. రణబీర్ కపూర్ నటించనున్న ‘రామాయణం’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళి (నవంబర్ 6) నాడు, రెండవ భాగం 2027 దీపావళి నాడు విడుదలవుతాయి.
ఈ చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని కోసం కేటాయించిన రూ. 4000 కోట్ల బడ్జెట్, నిర్మాతలు ఏమాత్రం వెనుకాడకుండా భారీగా పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద విడుదలగా నిలవడమే కాకుండా, జేమ్స్ కామెరాన్ చిత్రాల స్థాయిని కూడా అధిగమించేలా ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ పౌరాణిక ఇతిహాస చిత్రం ట్రైలర్ జులై 30న వివిధ భాషల్లో విడుదలైంది. అందులోనూ ఆంగ్ల వెర్షన్‌కు విశేష ఆదరణ లభించింది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే వివిధ వేదికలు, భాషలన్నింటిలో కలిపి100 కోట్లు వ్యూస్‌ను దాటింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 59,000 స్క్రీన్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిస్సందేహంగా, ఇంత భారీ స్థాయిలో పంపిణీ చేయబడే అతిపెద్ద భారతీయ చిత్రంగా ఇది నిలుస్తుంది. సోనీ పిక్చర్స్ దేశీయంగా 9,000కు పైగా స్క్రీన్‌లు, అంతర్జాతీయంగా 50,000 స్క్రీన్‌లను జోడించడంపై దృష్టి సారిస్తోందని, తద్వారా మొత్తం స్క్రీన్‌ల సంఖ్య 59,000కు చేరుకుంటుందని సమాచారం.
దీనిని బట్టి చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న స్థాయి, జేమ్స్ కామెరాన్ చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కంటే ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది. జో సల్దానా నటించిన ఆ సీక్వెల్ చిత్రం 52,000 స్క్రీన్‌లలో ప్రదర్శితమై, థియేటర్ల ద్వారా $2.3 బిలియన్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి కూడా అలాంటి స్పందన లభిస్తే, ఇది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి, ఇతర రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా, రాముడి తండ్రి దశరథుడిగా అరుణ్ గోవిల్ (90ల్లో టీవీ సీరియల్ రామాయణలో రాముడి పాత్రధారి), సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. జూలై 30న విడుదలైనఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తుంది. ఈ చిత్రాన్ని సుమారు ప్రపంచ వ్యాప్తంగా 50 భాషల్లో విడుదల చేయనున్నారు. ఏఐ ఆధారిత లిప్ సింక్ టెక్నాలజీతో ఐమ్యాక్స్ స్క్రీనింగ్‌లతో సహా ప్రీమియం ఫార్మాట్‌లో కూడా రూపొందిస్తున్నారు. ఇందుకు డీఎన్‌ఈజీ బ్రహ్మ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

More Stories
విద్యార్థులతో ఝార్ఖండ్ ప్రభుత్వం చర్చలు.. నిరసనలు కొనసాగింపు
జార్ఖండ్ నిరాహారదీక్షలో ఒకరు ఆసుపత్రికి .. చర్చలకు సీఎం ఆహ్వానం
ఆందోళన వద్దు, నేను మీతో ఉన్నా.. రెబెల్ ఎంపీలకు మోదీ భరోసా