“నా మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్‌రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతున్నారు” అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆరోపించారు.
తనను ఆ పదవి నుండి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పందిస్తూ “రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్ల, ప్రభుత్వ భూము లు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం” అని స్పష్టం చేశారు.
“ప్రభుత్వాలు నాకు గతం లో, ఇప్పుడు, మున్ముందు ఏ బా ధ్యతలు అప్పగించినా నేను నా వై పు నుండి 100 శాతం ఫలితాలు ఇవ్వటానికి పని చేస్తున్నాను, చేస్తాను.” అని వెల్లడించారు. తాను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగిందని స్పష్టం చేసారు.
“మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు), ఆరు చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ద్ధరించాను” అని రంగనాథ్ వెల్లడించారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు పదివేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని, అనుమతులు లేకుండా రూ. 2500 కోట్ల విలువైన హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసిందని ఆయన తెలిపారు.
సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతోపాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగిందని రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి తనపై ధిక్కారణ కేసు వేయటం జరిగిందని రంగనాథ్ పేర్కొన్నారు.

More Stories
ఉత్తర తెలంగాణ అభివృద్ధికి బెంచ్ మార్క్ ‘ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్’
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు
భారత్ బలోపేతానికి ఆర్థిక స్వావలంబన అవసరం