సిరియా రాజధానిలో భారీ పేలుళ్లలో తప్పించుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు  

సిరియా రాజధానిలో భారీ పేలుళ్లలో తప్పించుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు  
సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్ మెక్రాన్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆయన విడిది చేసిన హోటల్ వద్ద రెండు వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు భద్రత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పేలుళ్ల శబ్దాలు అధ్యక్షుడికి వినబడలేదని ఫ్రెంచ్ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం ఎలీసా ప్యాలెస్ స్పష్టం చేసింది. 
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆయన  సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో సమావేశమయ్యారు. 2024లో షరా నేతృత్వంలోని రెబల్స్ బషర్ అల్-అసద్‌ను గద్దె దించిన తర్వాత, సిరియాలో పర్యటించిన ఐరోపా సమాఖ్య కు చెందిన మొదటి దేశాధినేత మెక్రాన్ కావడం గమనార్హం. అయితే ఈ తాజా పేలుళ్లు సిరియాలో ఉన్న తీవ్రమైన భద్రతా సవాళ్లను మరోసారి ఎత్తిచూపుతున్నాయి.

రాయిటర్స్‌కు చెందిన ఒక ప్రత్యక్ష సాక్షి సమీపంలో పేలుళ్లు విన్నారని, మంటలు ఎగిసిపడటం చూశారని తెలిపారు. రహదారులను మూసివేసి, భద్రతా చర్యలు చేపట్టారని ఆ భద్రతా వర్గం పేర్కొంది. అధ్యక్షుడి కాన్వాయ్ నుంచి ఈ పేలుళ్ల శబ్దం వినిపించలేదని, మెక్రాన్‌తో పాటు ఉన్న పత్రికా బృందంలోని రాయిటర్స్ విలేకరి కూడా ఆయన కార్యక్రమాల సమయంలో పేలుడును వినలేదని లేదా ఎలాంటి గందరగోళాన్ని చూడలేదని ఎలీసా తెలిపింది.

 
ఇదిలా ఉండగా, సిరియాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను చాలా వరకు తొలగించేలా యూరప్, అమెరికాలపై ఒత్తిడి తీసుకురావడంలో మెక్రాన్ కీలక పాత్ర పోషించారు. ఆయన సోమవారం రాత్రి ఒక ఆర్థిక ప్రతినిధి బృందంతో ఆ దేశానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, సిరియాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను చాలా వరకు తొలగించేలా యూరప్, అమెరికాలపై ఒత్తిడి తీసుకురావడంలో మెక్రాన్ కీలక పాత్ర పోషించారు.
ఆయన సోమవారం రాత్రి ఒక ఆర్థిక ప్రతినిధి బృందంతో ఆ దేశానికి చేరుకున్నారు. ఇక, సిరియాలోని అల్- షరా ప్రభుత్వం దేశంపై పూర్తి నియంత్రణను సాధించడానికి, వివిధ తిరుగుబాటు ముఠాలు, సాయుధ సమూహాల మధ్య జరుగుతున్న అంతర్గత హింసను అణచివేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.