ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతూ నిజాయితీ, నిబద్ధతతో వార్తలను ప్రజలకు అందించే పాత్రికేయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, మీడియా యాజమాన్యాలు, పాత్రికేయ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, గృహ వసతి, పెన్షన్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు గతంలో అమలులో ఉన్న రైల్వే ప్రయాణ రాయితీ పాసుల పునరుద్ధరణ అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.
ఈ అంశాన్ని గతంలోనూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పాసుల సౌకర్యాన్ని పునరుద్ధరించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్ర టీజెఏ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ టి జే ఏ ను ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని, అన్ని జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు వేశామని పేర్కొంటూ డిఎంఏసీ. కమిటీలు జిల్లాలో టి జే ఏ సభ్యత్వం పెంచాలని కోరారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్ యూ జే (ఐ) కృషి చేస్తుందని ఎన్ యూ జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ చెప్పా. జర్నలిస్ట్ రైల్వే పాస్ ల గురించి పలుమార్లు కేంద్రం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం అన్నారు. టి జే ఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షత వహిస్తూ రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై తమ దృష్టికి తేవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ నిజమోద్దీన్, తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్. ఏ ఎస్ రావు కూడా ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు ప్రతినిధులు తమ సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంఘటితంగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు.

More Stories
ఫాతిమా ఒవైసీ విద్యా సంస్థలపై ఆరోపణలను పట్టించుకోరే!
సింగరేణిలో సంస్కరణాలకై ఓ ప్రత్యేక కమిటీ
భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రమాణాల రభస.. బీజేపీ శుద్ధి